పునర్నవి ఎమోషనల్.. ఈ జీవితం నాకు చాలా ఇచ్చిందంటూ...

Punarnavi Bhupalam : సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పునర్నవి.. తాజాగా ఓ పిక్‌ను షేర్ చేస్తూ.. ఈ జీవితం చాలా ఇచ్చిందని ఓ ఎమోషన్‌ పోస్ట్ చేసింది..

news18-telugu
Updated: October 21, 2019, 9:48 AM IST
పునర్నవి ఎమోషనల్.. ఈ జీవితం నాకు చాలా ఇచ్చిందంటూ...
Instagram/punarnavib
  • Share this:
Punarnavi Bhupalam : పునర్నవి భూపాలం.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా క్యూట్ క్యూట్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్ తరుణ్, అవికాగోర్ హీరో హీరోయిన్స్‌గా చేశారు. ఆ తర్వాత పునర్నవి.., శర్వానంద్ హీరోగా వచ్చిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో హీరో కూతురుగా నటించి మంచి నటనతో అదరగొట్టింది. ఆ మద్య ‘పిట్టగోడ’ అనే సినిమాలో హీరోయిన్‌గా కూడ యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందింది పున్ను. తాజాగా Bigg Boss Telugu 3లో ఓ కంటెస్టెంట్‌‌గా పాల్గొన్న విషయం తెలిసిందే. హౌజ్‌లో ఉన్నంత కాలం లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. మరో ఇంటి సభ్యుడు రాహుల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ.. బిగ్ బాస్ హౌజ్ ప్రేమ పావురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
 View this post on Instagram
 

I am grateful to have a life like this. Wonderful one of course.


A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

మూడు వారాల ముందే హౌజ్ నుండే ఎలిమినేట్ అయిన పునర్నవి తన సక్సెస్‌ను సెలెబ్రెట్ చేసుకుంటోంది. అందులో భాగంలో తన తమ్ముడు, ఫ్రెండ్స్‌తో సెలెబ్రేట్ చేసుకుంటున్నా.. కొన్ని ఫోటోస్‌‌ను తన సోషల్ మీడియాలో  షేర్ చేసింది. అది అలా ఉంటే తాజాగా పున్ను ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో.. ఎమోషన్‌గా రాస్తూ.. ఈ జీవితం తనకు చాలా ఇచ్చిందని.. చాలా హ్యపీ అంటూ.. కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాకుండా బీచ్‌లో ఏకాంతంగా కూర్చోని.. బ్లూ డ్రెస్‌లో ఉన్న ఓ పిక్‌ను షేర్ చేసింది. కాగా పునర్నవి ప్రస్తుతం 'సైకిల్', 'చిన్న విరామం' సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు పున్నుకు అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ సందీప్ వంగా దర్శకత్వంలో ఓ అవకాశం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. 
View this post on Instagram
 

And then, there’s me trying to click this picture without my glasses on.


A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

పునర్నవి అదిరిపోయే పిక్స్
Published by: Suresh Rachamalla
First published: October 21, 2019, 9:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading