పునర్నవి కొత్త బాయ్‌ఫ్రెండ్ అతడే.. రాహుల్ సిప్లిగంజ్‌కు షాక్..

Rahul Sipligunj Punarnavi: పునర్నవి భూపాలం.. ఈ పేరు చెప్పగానే మరో పేరు కూడా వెంటనే గుర్తుకొస్తుంది. అతడే రాహుల్ సిప్లిగంజ్. బిగ్ బాస్ 3 పుణ్యమా అని ఈ ఇద్దరూ బాగా ఫేమస్ అయిపోయారు. ఒకరి కోసం ఒకరు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 10, 2020, 4:05 PM IST
పునర్నవి కొత్త బాయ్‌ఫ్రెండ్ అతడే.. రాహుల్ సిప్లిగంజ్‌కు షాక్..
రాహుల్, పునర్నవి (Instagram/sipligunjrahul)
  • Share this:
పునర్నవి భూపాలం.. ఈ పేరు చెప్పగానే మరో పేరు కూడా వెంటనే గుర్తుకొస్తుంది. అతడే రాహుల్ సిప్లిగంజ్. బిగ్ బాస్ 3 పుణ్యమా అని ఈ ఇద్దరూ బాగా ఫేమస్ అయిపోయారు. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఈ షోలో ఉన్నారు వాళ్లు. చివరికి రాహుల్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా అందరికంటే ఎక్కువగా పున్ను బేబీ ఆనందించింది. వాళ్లు ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా కలిసి తిరగడం.. ఎక్కడికెళ్లినా కలిసే కనిపించడంతో నిజంగానే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ఎక్కువైపోయాయి. పైగా బయట కూడా కలిసే కనిపిస్తున్నారిద్దరూ. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారేమో అనే వార్తలు కూడా వచ్చాయి.

రాహుల్, పునర్నవి (Instagram/sipligunjrahul)
రాహుల్, పునర్నవి Instagram/sipligunjrahul


అప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడే నాగార్జున కూడా ఈ ఇద్దరి రిలేషన్ గురించి హైలైట్ చేసాడు. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేసారు వాళ్లు. అయితే అది వాళ్లు క్రేజ్ కోసం చేసారా.. లేదంటే నిజంగానే ఇద్దరూ ప్రేమలో ఉన్నారా అనేది మాత్రం సస్పెన్స్. ఎప్పుడు అడిగినా కూడా రాహుల్ వైపు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. పునర్నవి మాత్రం అలాంటిదేం లేదన్నట్లుగానే సమాధానం చెబుతూ వచ్చింది. ఈ మధ్య పునర్నవి ఒక చిన్న విరామం సినిమా చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌తోనే బిజీగా ఉంది. ఇక సినిమాలు చాలు.. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని పున్ను ఆలోచిస్తుందంటూ వార్తలొచ్చాయి. కానీ ఇది అబద్ధమని ఆమె కూడా తేల్చేసింది.

రాహుల్, పునర్నవి (Instagram/sipligunjrahul)
రాహుల్, పునర్నవి (Instagram/sipligunjrahul)


మరోవైపు రాహుల్ కూడా తమ మధ్య ఏం లేదని చెప్పే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇప్పుడు పునర్నవి మరోసారి రాహుల్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడింది. తాను ఒక హైదరాబాదీతో ప్రేమలో ఉన్నానని సంచలన నిజాన్ని బయటపెట్టింది ఈమె. రాహుల్ సిప్లిగంజ్‌తో తనకేం లేదని చెప్పడానికే ఈ నిజం చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. హైదరాబాదీతో ప్రేమలో ఉన్నానని చెప్పింది కానీ అతనెవరో మాత్రం చెప్పడం లేదు ఈ ముద్దుగుమ్మ. రాహుల్ కూడా హైదరాబాదీనే కదా అంటూ సోషల్ మీడియాలో పున్నును అడుగుతున్నారు అభిమానులు. అయితే రాహుల్ మాత్రం కాదని చెబుతుంది ఈ బ్యూటీ. రాహుల్‌‌తో వస్తున్న పుకార్లకు స్వస్తి చెప్పేందుకే పునర్నవి ఇలా కొత్త బాయ్‌ఫ్రెండ్ టాపిక్ తీసుకొచ్చిందనే వాళ్లు కూడా లేకపోలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం రాహుల్ సిప్లిగంజ్‌‌కు పెద్ద షాక్ తప్పకపోవచ్చు.
First published: February 10, 2020, 4:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading