రాహుల్‌తో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చేసిన పునర్నవి

మొత్తానికి హౌస్ నుంచి బయటకొచ్చిన పునర్నవి రాహుల్ తో ఉన్న అనుబంధంపై సస్పెన్స్‌కు తెరదించేసింది. మరి దీనిపై రాహుల్ ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే.

news18-telugu
Updated: October 12, 2019, 3:02 PM IST
రాహుల్‌తో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చేసిన పునర్నవి
రాహుల్, పునర్నవి
news18-telugu
Updated: October 12, 2019, 3:02 PM IST
బిగ్ బాస్ తెలుగు సీజన్3 నుంచి తాజాగా జరిగిన ఎలిమినేషన్‌లో పునర్నవి బయటకు వచ్చేసింది. దీంతో ఆమె బిగ్ హౌస్‌లో జరిగిన అనేక విషయాలపై బయట ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా పునర్నవి బిగ్ హౌస్‌లో సింగర్ రాహుల్‌తో తనకు ఎలాంటి అనుబంధం ఉందన్న విషయాన్ని బయటపెట్టింది. పునర్నవి బిగ్ హౌస్‌లో ఉన్నప్పుడే ఆమె... రాహుల్‌తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. అయితే ఇటీవల ఆ షో నుంచి బయటకు వచ్చిన ఆమె తాజాగా ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

రాహుల్‌తో తాను ప్రేమలో ఉన్నానంటూ సోషల్‌మీడియాలో వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడుతూ.. ‘రాహుల్‌ నాకు మంచి స్నేహితుడని చెప్పింది పునర్నవి. ఆ షోలో అతడితో ఎక్కువగా గొడవ పడేదాన్ని కాదంది. అందుకే అందరూ తాము ప్రేమలో ఉన్నామనుకుంటున్నారని చెప్పుకొచ్చింది పునర్నవి. వారి ఇద్దరి మధ్య చాలా స్వచ్ఛమైన స్నేహబంధం ఉందని తెలిపింది.. అయితే మొదట్లో రాహుల్‌ని తనకు దూరంగా ఉండమని చెప్పేదాన్నని పేర్కొంది. అయితే బయట తమ స్నేహం గురించి వేరేలా మాట్లాడుకోవడం చూస్తే చాలా బాదేసిందని.. ఆ తర్వాత వేరేవాళ్ల మాటల్ని పట్టించుకోవడం మానేసానని తెలిపింది. మొత్తానికి హౌస్ నుంచి బయటకొచ్చిన పునర్నవి రాహుల్ తో ఉన్న అనుబంధంపై సస్పెన్స్‌కు తెరదించేసింది. మరి దీనిపై రాహుల్ ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...