రాహుల్ సిప్లిగంజ్‌పై పునర్నవి సీరియస్.. చేసిన కథలు చాలు..

Rahul Sipligunj Punarnavi: ఏమో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనుమానం అందరిలోనూ వస్తుంది. నిజంగానే రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్యలో బాగానే గ్యాప్ వచ్చినట్లు అర్థమవుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 6, 2020, 6:39 PM IST
రాహుల్ సిప్లిగంజ్‌పై పునర్నవి సీరియస్.. చేసిన కథలు చాలు..
పునర్నవి, రాహుల్
  • Share this:
ఏమో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనుమానం అందరిలోనూ వస్తుంది. నిజంగానే రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్యలో బాగానే గ్యాప్ వచ్చినట్లు అర్థమవుతుంది. బిగ్ బాస్ సమయంలో వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ అంతా చర్చ జరిగింది. సాక్షాత్తు హోస్ట్ నాగార్జున కూడా ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని కన్ఫర్మ్ చేయడంతో అంతా అదే ఫిక్సైపోయారు. ఆ తర్వాత కూడా రాహుల్ పున్ను ఎక్కడ కనిపించినా కూడా వాళ్లిద్దరి కెమిస్ట్రీ మరో స్థాయిలో ఉంటుంది. ఓ సమయంలో ఇద్దరూ ఒప్పుకుంటే పెళ్లి కూడా చేస్తామని అనౌన్స్ చేసారు రాహుల్ పేరెంట్స్. ఇలాంటి సమయంలో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య గ్యాప్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

రాహుల్, పునర్నవి (Instagram/sipligunjrahul)
రాహుల్, పునర్నవి Instagram/sipligunjrahul


ప్రస్తుతం రాహుల్‌పై జరిగిన దాడి ఘటన రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. పబ్‌లో ఈయనపై జరిగిన దాడి సంచలనంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి తనపై దాడి చేసాడంటూ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాడు రాహుల్. అయితే ఈ దాడి జరిగిన తర్వాత కచ్చితంగా పునర్నవి నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందేమో అని ఊహించారంతా. కానీ కనీసం రియాక్షన్ కాదు కదా చిన్న సింపతీ స్టేట్‌మెంట్ కూడా రాలేదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా స్పందించినట్లు దాఖలాలు అయితే కనిపించలేదు. ఇప్పటి వరకు అఫీషియల్‌గా రాహుల్ ఘటనపై పున్ను అయితే మాట్లాడలేదు.. నోరు విప్పలేదు. అంతగా ఫ్రెండ్ అయితే కచ్చితంగా ఈ దాడిపై మాట్లాడాలి కదా అంటున్నారు అభిమానులు.

రాహుల్, పునర్నవి (Instagram/sipligunjrahul)
రాహుల్, పునర్నవి (Instagram/sipligunjrahul)


ఒకవేళ పర్సనల్‌గా ఫోన్ చేసి ఉండొచ్చు కదా అనుకోవచ్చు కానీ సెలబ్రిటీస్ కాబట్టి కచ్చితంగా పబ్లిసిటీ అయితే కావాల్సిందే. పునర్నవి మాత్రమే కాదు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా కూడా ఈ ఘటనపై సైలెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. మేమంతా ఒక్కటే.. ఒకరికి ఒకరం అంటూ పోస్టులు పెట్టుకునే వాళ్లు రాహుల్ విషయంలో మాత్రం సైలెంట్ అయిపోయారు. అదేంటో మరి ఈ లాజిక్ ఎవరికీ అర్థం కావడం లేదు. రాహుల్ తప్పు చేసాడా ఒప్పు చేసాడా పక్కనబెడదాం.. కనీసం ఫ్రెండ్‌కు ఇలా జరిగినపుడు కచ్చితంగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది కదా అంటున్నారు నెటిజన్లు. మొన్నటికి మొన్న శివజ్యోతి గృహప్రవేశానికి అంతా కలిసి వచ్చారు.. అంటే సంతోషంలో కలిసుంటారు కానీ బాధ వచ్చినపుడు దూరమైపోతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలిక.. రాహుల్ ఘటనపై ఇప్పటికైనా పున్ను బేబీ స్పందిస్తుందో లేదో..?
First published: March 6, 2020, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading