పెళ్లిలో డాన్స్ ఇరగదీసిన పునర్నవి భూపాలం...
పునర్నవి భూపాలం తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోతో యూత్‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది.
news18-telugu
Updated: December 4, 2019, 3:01 PM IST

Instagram/punarnavib
- News18 Telugu
- Last Updated: December 4, 2019, 3:01 PM IST
పునర్నవి భూపాలం తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోతో యూత్‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంత కాలం తోటి ఇంటి సభ్యుడు రాహుల్‌తో సాన్నిహిత్యంగా మెలగడం, వీరి కెమిస్ట్రీని బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయడంతో ఈ భామకు యూత్‌లో అదిరిపోయే పాపులారిటీ వచ్చింది. అంతెందుకు... చాలా మంది వ్యువర్స్ కేవలం ఈ ఇద్దరీ కెమిస్ట్రీని చూడటానికి ఇష్టపడేవారు. దీనికి తోడు రాహుల్, పునర్నవి ప్రేమించుకుంటున్నారని ఓ టాక్ కూడా బయటకు వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యారు ఈ ఇద్దరూ. అంతేకాదు బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారని సోషల్ మీడియాల్లో వార్తలు తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే రాహుల్, పునర్నవి మీడియా చానల్స్‌కు, పలు యూట్యూబ్ చానల్స్‌తో మాట్లాడుతూ.. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని.. అంతేకాని లవర్స్ కాదంటూ స్పష్టం చేశారు. అది అలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన పున్ను తెగ ఎంజాయ్ చేస్తోంది. ఫ్రెండ్స్‌తో పార్టీలు చేస్తూ అదరగొడుతోంది. కాగా తాజాగా ఓ పెళ్లి వీడియోను ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో పున్ను డ్యాన్స్‌తో అదరగొడుతోంది. అది చూసిన అభిమానులు, నెటిజన్స్ డ్యాన్స్ అదరగొట్టావంటూ కామెంట్స్ పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

అదిరిన నిధి అగర్వాల్ లేటెస్ట్ పిక్స్...

Instagram/punarnavib
అదిరిన నిధి అగర్వాల్ లేటెస్ట్ పిక్స్...
Loading...