Bigg Boss3: సంబరాల్లో రాహుల్ ఫ్యామిలీ ... పునర్నవి కూడా వచ్చిందిగా

బిగ్ బాస్ ఇంట్లో చిగురించిన ఈ నలుగురి స్నేహం చివరి వరకు తమ స్నేహబంధాన్ని కొనసాగించారు.

news18-telugu
Updated: November 4, 2019, 4:37 PM IST
Bigg Boss3: సంబరాల్లో రాహుల్ ఫ్యామిలీ ... పునర్నవి కూడా వచ్చిందిగా
రాహుల్ పార్టీలో పునర్నవి భూపాలం
  • Share this:
బిగ్ బాస్-3 రియాల్టీ షో ముగిసిన తరువాత విజేతగా నిలిచిన రాహుల్ ఫుల్ జోష్‌లో మునిగి తేలుతున్నాడు. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫుల్ పార్టీ చేసకున్నాడు. రాహుల్ పార్టీలో వరుణ్, వితికలతో పాటు.. పునర్నవి కూడా పాల్గొంది. రాహుల్ సిప్లిగంజ్ పార్టీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియలో ట్రెండింగ్ అవుతున్నాయి. బిగ్ బాస్ ఇంట్లో ఈ నలుగురు ఓ గ్యాంగ్ గా ఏర్పడి చివరి వరకు తమ స్నేహబంధాన్ని కొనసాగించారు. ఇక రాహుల్, పునర్నవి మధ్య లవ్ ఉందంటూ గాసిప్స్ వచ్చిన వార్తలు కూడా తెలిసిందే. హౌస్‌ నుంచి బయటకొచ్చిన తర్వాత పునర్నవి.. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చింది. రాహుల్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ... చెప్పుకొచ్చింది. అయితే రాహుల్ సెలబ్రేషన్స్‌లో పునర్నవి కనిపించడం అతని అభిమానులతో పాటు... బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్ ఫైనల్స్‌లో రాహుల్ విన్నర్‌‌గా టైటిల్ అందుకున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్‌ రూ.50 లక్షల నగదు, ట్రోఫీ అందుకున్నారు. జులై 21న ప్రారంభమైన సీజన్‌-3 చివరి వరకు ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. యూట్యూబ్‌ ద్వారా రాహుల్‌ సింగర్‌గా కెరీర్‌ ప్రారంభించాడు. సంగీతం కంపోజ్‌ చేస్తూనే పాటలు పాడేవారు. 2009లో వచ్చిన ‘జోష్‌’తో గాయకుడిగా పరిచయం అయ్యారు. ఇదే సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించారు. ఆపై ‘దమ్ము’, ‘ఈగ’, ‘లై’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘రంగస్థలం’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తదితర చిత్రాల కోసం పాటలు పాడి, ఆకట్టుకున్నారు.





First published: November 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com