హోమ్ /వార్తలు /సినిమా /

Punarjanma - Radhe Shyam : తెలుగు సినిమాల్లో పునర్జన్మలు.. మగధీర,అరుంధతి, ఇపుడు రాధే శ్యామ్..

Punarjanma - Radhe Shyam : తెలుగు సినిమాల్లో పునర్జన్మలు.. మగధీర,అరుంధతి, ఇపుడు రాధే శ్యామ్..

’రాధే శ్యామ్’ ‘మగధీర’, అరుంధతి’ తెలుగులో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు (File/Photo)

’రాధే శ్యామ్’ ‘మగధీర’, అరుంధతి’ తెలుగులో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు (File/Photo)

Punarjanma - Radhe Shyam : పునర్జన్మ అనాదిగా మనిషికున్న ఒక ఆసక్తి. అంతేకాదు మనిషి తర్కానికి అందకుండా తప్పించుకుని తిరుగుతున్న ఒక ఆశ్చర్యం. ఇపుడు ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రాధే శ్యామ్’ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంకా చదవండి ...

Punarjanma - Radhe Shyam : పునర్జన్మ అనాదిగా మనిషికున్న ఒక ఆసక్తి. అంతేకాదు మనిషి తర్కానికి అందకుండా తప్పించుకుని తిరుగుతున్న ఒక ఆశ్చర్యం. మనిషి విజ్ఞానాన్ని సవాల్ చేస్తున్న ఒక అద్భుతమనే చెప్పాలె. ఈ అద్భుతాన్ని మన సినిమా వాళ్లు మంచిగనే క్యాష్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ పునర్జన్మ నేపథ్యాన్ని మన సినిమా వాళ్లు...హిందూ పురాణాల్లో ఉన్న దశావతారాలు...బుద్దుని జాతక కథలను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించారు. ఈ రకంగా వెండితెరపై పునర్జన్మల నేపథ్యంల తెరకెక్కిన సినిమాలు ఏవేవున్నయో ఒక సారి చూద్దాం..పునర్జన్మ మనిషి ప్రగాఢంగా వాంఛిస్తున్న ఒక సంభవం. పునర్జన్మ మనిషిని నిత్యం జాగృతం చేస్తున్న ఒక భయం అనే చెప్పాలి.

పునర్జమ్మ మనిషి ఛేధించలేకపోతున్న ఒక రహస్యమనే చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ పై పునర్జన్మ ల నేపథ్యంలో వచ్చిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. తాాజాగా ’రాధే శ్యామ్’ సినిమా పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కించారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ (Twitter/Photo)

ఇక 90 ఏళ్లకు దగ్గరపుడుతోన్న తెలుగు సినీ చరిత్రల పునర్జన్మలు సూపర్ హిట్ మంత్రమని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది.తెలుగుల పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల విషయానికొస్తే...ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘మూగ మనసులు. ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్‌లో....ఏఎన్నాఆర్, సావిత్రి, జమున లీడ్ రోల్ల నటించిన ఈ మూవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిపోయింది.

మూగ మనసులు (File/Photo)

మొదటి జన్మలో ప్రేమించుకున్న హీరో, హీరోయిన్లు...ఆస్తులు అంతస్థుల కారణంగా దూరమైపోతారు. ఆ తర్వాత రెండో జన్మలో ఈ ప్రేమ పక్షులు ఒకటైపోతారు. ఆ తర్వాత ఇదే సినిమా కే.రాఘవేంద్రరావు కొంత ఛేంజ్ చేసి నాగార్జున, విజయశాంతిలతో జానకిరాముడుగా ప్రీమేక్ గా తీసి మంచి సక్సెస్‌ను అందుకున్నారు.

జానకి రాముడు (File/Photo)

జానకి రాముడు కంటే తెలుగులో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన మరో సినిమా ’దేవదాసు మళ్లీ పుట్టాడు’. దాసరి నారాయణ రావు, అక్కినేని నాగేశ్వరరావు   కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ.

Samantha International Movie : సమంత కంటే ముందు ఇంటర్నేషనల్ మూవీస్‌లో నటించిన మన దేశపు స్టార్స్ వీళ్లే..

ఈ సినిమాలో వాణిశ్రీ అక్కినేనికి జోడిగా నటించింది.ఇక అక్కినేని నాగేశ్వరరావు, మంజుల హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘బంగారు బొమ్మలు’ మూవీ కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కించారు.

దేవదాసు మళ్లీ పుట్టాడు, బంగారు బొమ్మలు (Twitter/Photo)

ఆ తర్వాత కృష్ణ, వాణిశ్రీ జోడిగా నటించిన ‘జన్మజన్మల బంధం’ కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

జన్మజన్మల బంధం (File/Photo)

అటు 1985ల బాలకృష్ణ, సిల్మ్ స్మిత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆత్మ బలం’ కూడా పునర్జన్మలను బేస్ చేసుకొని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని ఇవ్వలేదు.

ఆత్మ బలం (File/Photo)

ఆ తర్వాత తెలుగుల చాలా ఏళ్ల తర్వాత కే.రాఘవేంద్రరావు .. వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన ‘సుభాష్ చంద్రబోస్’ సినిమా కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిందే. ముందు జన్మలో తనని చంపిన వారిపై మరు జన్మలో పగ తీర్చుకోవడమనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ‘సుభాష్ చంద్ర బోొస్’ (Twitter/Photo)

పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అరుంధతి. అనుష్క హీరోయన్ గా కోడిరామకృష్ణ డైరెక్షన్‌లో...శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సిన్మాల్లో ఒక హిస్టరీ క్రియేట్ చేసింది.

అరుంధతి (File/Photo)

ఆ తర్వాత అదే యేడాది రాజమౌళి డైరెక్షన్ల వచ్చిన మగధీర పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. రామ్ చరణ్, కాజల్ నటించిన ఈ సోషియో ఫాంటసీ మూవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. గత జన్మల ప్రేమలో ఓడిపోయిన హీరో, హీరోయిన్లు నెక్ట్స్ జన్మలో మళ్లీ ఒకటైపోతారు.

మగధీర (File/Photo)

అటు ఇదే రూట్లో రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఈగ’ ఏ స్టార్ ఇమేజ్ లేకపోయినా....పునర్జన్మ సబ్జెక్ట్ లో ఉన్న దమ్ము ఏంటో చూపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిందో తెలిసిందే కదా. ఈ సినిమాలో విలన్ సుదీప్‌ను ఈగ ఏ రకంగా ముప్పతిప్పలు పెట్టిందో చూసాము కదా.

రాజమౌళి ఈగ (Rajamouli Eega)

అటు అల్లరి నరేశ్, సదా జంటగా తెరకెక్కిన ‘ప్రాణం’ మూవీ కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన మూవీ అనే చెప్పాలె. ఈ మూవీ అనుకున్నంత రేంజ్‌లో నడవలేదు.

ప్రాణం మూవీ (File/Photo)

అటు అక్కినేని ఫ్యామిలీ మొత్తం హోల్ సేల్ గా నటించిన ‘మనం’ సినిమా కూడా పునర్జన్మల నేపథ్యంల తెరకెక్కినదే. అటు అక్కినేని వంశానికి పునర్జన్మలకు ఏదో లింకు వున్నట్టే వుంది. అటు ఏఎన్నాఆర్, నాగార్జునలు ఈ తరహా సబ్జెక్ట్స్ ను విడి విడిగా చేసి మంచి సక్సెస్‌ను అందుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య ఆళ్ల తాత ఏఎన్నాఆర్, నాయన నాగార్జునలతో కలిసి చేసిన ‘మనం’ సినిమా కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కడం పెద్ద విచిత్రమనే చెప్పాలె.

‘మనం’ మూవీ (File/Photo)

అటు విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన బేతాళుడు మూవీ కూడా పునర్జన్మ నేపథ్యంల తెరకెక్కిన మూవీనే. మొత్తంగా పునర్జన్మ కాన్సెప్ట్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీల సక్సెస్ ఫార్ములాగా మారింది.

బేతాళుడు (File/Photo)

అటు రాజమౌళి కాదు.. పూరీ జగన్నాథ్ కూడా తన తనయుడు ఆకాష్ పూరీ కూడా ‘మెహబూబా’ సినిమాను తెరకెక్కించారు. పూర్వ జన్మలో పాకిస్థాన్  సైనికుడుగా ఉండే హీరో .. మరు జన్మలో భారత దేశంలో జన్మిస్తాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

‘మెహబూబా’ మూవీ ఆకాష్ పూరీ (Twitter/Photo)

అటు తెలుగులనే కాదు...వేరే భాషలల్ల కూడా పునర్జన్మ అనేది సక్సెస్ ఫార్ములాగా అనే చెప్పాలె. హిందీ సిన్మాల విషయానికొస్తే...కమల్ ఆమ్రోహి దర్శకత్వంల అశోక్ కుమార్, మధుబాల జంటగా 1949ల వచ్చిన ‘మహల్’ అప్పట్లో పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది.

Nagarjuna - K Raghavendra Rao : నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

హిందీ చిత్ర సీమలో పునర్జన్మల నేపథ్యంల తెరకెక్కిన తొలి సినిమా ఇదే. ఈ మూవీతో హీరోయిన్ గా మధుబాల, గాయనిగా లతా మంగేష్కర్ వెనుదిరిగి  చూసుకోలేదు.

మహల్ మూవీ (File/Photo)

అటు ’మహల్’ మూవీకి ఎడిటర్ గా పనిచేసిన బిమల్ రాయ్...ఆతర్వాత దిలీప్ కుమార్, వైజయంతి మాల హీరో హీరోయిన్లుగా  తీసిన ‘మధుమతి’ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది.

మధుమతి మూవీ (File/Photo)

ఆ తర్వాత 1967ల తెలుగుల సూపర్ హిట్టైన ‘మూగ మనసులు’ సినిమాను...హిందీలో ఆదుర్తి సుబ్బారావు...సునీల్ దత్, నూతన్‌లతో ‘మిలన్’ గా రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ సక్సెస్ అయింది. అటు హిందీల జమున పాత్రను ఆమెనే చేయడం విశేషం.

’మిలన్’ మూవీ (File/Photo)

అటు వహీదా రహమాన్, రాజ్ కుమార్, మనోజ్ కుమార్ కాంబినేషన్ల రామ్ మహేశ్వరి డైరెక్షన్ల వచ్చిన ‘నీల్ కమల్’’ మూవీ పునర్జన్మల నేపథ్యంల వచ్చిన సినిమాల్లో ఒక సిలబస్ అనే చెప్పాలె.

‘నీల్ కమల్’ మూవీ (File/Photo)

అటు శతృఘ్న సిన్హా, గీతారాయ్, డానీ కాంబినేషన్ల తెరకెక్కిన ‘మిలాప్’ మూవీ కూడా పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కిందే. ఈ మూవీల శతృఘ్న సిన్హా ఐదు పాత్రలు పోషించడం విశేషం.

’మిలాప్’ మూవీ (File/Photo)

ఆ తర్వాత 1976ల శక్తి సామంత డైరెక్షన్ల..రాజేష్ ఖన్నా, హేమా మాలిని జంటగా తెరకెక్కిన ‘మెహబూబ’ కూడా పునర్జన్మల మీద తీసిన సినిమాల్లో పెను సంచలనమే క్రియేట్ చేసింది.

మెహబూబా (File/Photo)

1981ల చేతన్ ఆనంద్ డైరెక్షన్ల రాజేశ్ ఖన్నా, వినోద్ ఖన్నా, హేమామాలిని హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘కుద్రత్’ మూవీ కూడా పునర్జన్మల మూవీస్‌లో ఒక ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 1980ల సుభాష్ ఘాయ్ డైరెక్షన్ల తెరకెక్కిన ‘‘కర్జ్’’ కూడా పునర్జన్మలను బేస్ చేసుకొని తెరకెక్కించిన మూవీనే. పెళ్లి చేసుకున్న అమ్మాయి చేతిల హత్యకు గురైన ఒక ప్రేమికుడు...పునర్జన్మ ఎత్తి ఆమె నేరాన్ని నిరూపిస్తాడు.


రిషీ కపూర్, టీనా మునీమ్, సిమీ గెరెవాల్ నటించిన ఈ మూవీ ఆ యేడాది రిలీజైన హిందీ మూవీస్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదే చిత్రాన్ని బాలకృఫ్ణ ‘ఆత్మ బలం’గా రీమేక్ చేస్తే అంతగా నడవలేదు. అటు హిందీలనే కర్జ్ మూవీని 2008ల అదే టైటిల్ తో హిమేష్ రేష్మియా, ఊర్మిళలతో రీమేక్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

కర్జ్ న్యూ మూవీ (Twitter/Photo)

1988ల రాజ్ కుమార్ కోహ్లీ డైరెక్షన్ల మిథున్ చక్రవర్తి, డింపుల్ కపాడియా, మీనాక్షి శేషాద్రిలతో తీశిన ‘‘బీస్ సాల్ బాద్’’ సినిమా కూడా పునర్జన్మ నేపథ్యానికి కొంత సస్పెన్స్, హార్రర్ మిక్స్ చేసి తెరకెక్కించారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది.

‘బీస్ సాల్ బాద్’ (File/Photo)

1991ల డింపుల్ కపాడియా, వినోద్ ఖాన్న లీడ్ రోల్ల తీశిన ‘‘లేఖిన్’’ మూవీ కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిందే. ఆ తర్వాత యేడాది పునర్జన్మ నేపథ్యంల రాకేశ్ కుమార్ డైరెక్షన్‌లో సల్మాన్ ఖాన్, అమృతాసింగ్, షీబాలతో తెరకెక్కిన ‘‘సూర్యవంశీ’’ కూడా పునర్జన్మను నమ్ముకోనే తెరకెక్కించారు.

‘సూర్యవంశీ’ మూవీ (File/Photo)

అటు గోవిందా, కరిష్మా కపూర్ జంటగా శిబు మిత్ర డైరెక్షన్ల వచ్చిన ‘ప్రేమ్ శక్తి’’ మూవీ కూడా పునర్జన్మ జానర్ల తెరకెక్కింది.  1995ల రాకేష్ రోషన్ డైరెక్షన్ల సల్మాన్, షారుఖ్ హీరోలుగా తెరకెక్కిన ‘కరణ్ అర్జున్’’ మూవీ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఈ మూవీని ప్రేమకోసం పునర్జన్మ ట్రెండ్ కాకుండా...అమ్మకోసం మళ్లీ పుట్టడం అనే కాన్సెప్ట్‌ను తీసుకొని తెరకెక్కించారు డైరెక్టర్ రాకేశ్ రోషన్. ఈ సినిమాను తెలుగులో ‘కథానాయకులు’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తే  ఇక్కడ ఓ రేంజ్‌లో నడిచింది.

కరణ్ అర్జున్ (File/Photo)

2007ల షారుఖ్, దీపికా పదుకొణే హీరో, హీరోయిన్లుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తీశిన ‘‘ఓం శాంతి ఓం’’ సిన్మా కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ మూవీ బాలీవుడ్‌లో మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఓం శాంతి ఓం (File/Photo)

ఆ మధ్యకాలంల 1997ల కాజోల్, సైఫ్ అలీ ఖాన్ లతో వచ్చిన ‘హమేషా’..  రాజ్ కన్వర్ డైరెక్షన్‌లో ఆర్య బబ్బర్, అమృతారావు జంటగా వచ్చిన ‘అబ్ కే బరస్’’ ఈ కోవలోనిదే. అటు అంత్రామాలి డైరెక్ట్ చేస్తూ నటించిన ‘‘మిస్టర్ యా మిస్’’ పునర్జన్మ కథా చిత్రాల్లో పెద్ద విచిత్రమనే చెప్పాలి. ఒక జన్మల అఫ్తాబ్ శివదాసానీ...నెక్ట్స్ జన్మల అంత్రామాలిగా జన్మించడం కాస్త వెరైటీ అని చెప్పుకోవాలి.

మిస్టర్ యా మిస్ (File/Photo)

ఈ క్రాస్ జెండర్ పునర్జన్మల జరిగే హాస్యమే ఈ సినిమా. 2012ల హ్యారీ బవేజా కొడుకు హర్మాన్ బవేజా పరిచయ చిత్రంగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన ‘‘లవ్ స్టోరీ 2050’’ పునర్జన్మ కథకి సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ జోడించి తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

లవ్‌స్టోరీ 2050 (File/Photo)

అటు కరిష్మా కపూర్ కమ్ బ్యాక్ సినిమా 2012ల వచ్చిన ‘డేంజరస్ ఇష్క్’’ కూడా అదే ఫలితాన్ని చవి చూసింది. ఇందుల కరిష్మా నాలుగు పునర్జన్మలు పొందడం విశేషం.ఇక దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘రాబ్తా’ మూవీ కూడా పునర్జన్మను బేస్ చేసుకొనే తెరకెక్కించారు. మగధీరను ప్రీమేక్ చేసిన ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌ను మూటగట్టుకుంది.  మొత్తానికి పునర్జన్మల నేపథ్యాన్ని ‘రాబ్తా’ మూవీ సరిగా క్యాష్ చేసుకోలేకపోయింది.

రాబ్తా (మూవీ)

ఒక రకంగా ఓల్డ్ నుంచి న్యూ జనరేషన్ వరకు పునర్జన్మ కాన్సెప్ట్ అనేది ఎక్కువ మటుకు సక్సెస్ అయినా...అపుడు అపుడు మాత్రం చేదు ఫలితాలనే అందించింది. తాజాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ మూవీలో ప్రభాస్ ..విక్రమాదిత్య క్యారెక్టర్ చేసారు. అటు పూజా హెగ్డే.. ప్రేరణ పాత్రలో నటించింది.

Radhe Shyam first single release date, Radhe Shyam Teaser, Prabhas and Pooja Hegde Radhe Shyam completes the shooting, Radhe Shyam on Zee5, Radhe Shyam ott release, Radhe Shyam video, Radhe Shyam released date, Radhe Shyam Teaser,Radhe Shyam Release Date, radhe shaym movie music director justin prabhakaran, ప్రభాస్,ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్, జస్టిన్ ప్రభాకరన్
‘రాధే శ్యామ్’ Radhe Shyam Photo : Twitter)

సినిమా టైటిల్ ‘రాధే శ్యామ్’ కాబట్టి ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కించారా అనేది చూడాలి. ఈ సినిమాను జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు.  మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘బింబిసార’ కూడా పునర్జన్మల నేపథ్యానికి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ జోడించి తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Bimbisara Nandamuri Kalyan Ram as Bimbisaram NKR 18
‘బింబిసార’గా నందమూరి కళ్యాణ్ రామ్ (Twitter/Photo)

మొత్తంగా ‘రాధే శ్యామ్’, ‘బింబిసార’ మూవీలు కూడా పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కయా లేదా అనేది తెలియాలంటే ఈ మూవీస్ రిలీజెస్ వరకు వేచి చూడాల్సిందే. మొత్తంగా చూసుకుంటే పునర్జన్మ కాన్సెప్ట్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎప్పటికీ చెక్కుచెదరని ఎవర్ గ్రీన్ ఫార్ములా అనే చెప్పాలె.

First published:

Tags: ANR, Anushka Shetty, Balakrishna, Bimbisara Movie, Bollywood news, Kalyan Ram Nandamuri, Nagarjuna Akkineni, Pooja Hegde, Prabhas, Rajamouli, Tollywood

ఉత్తమ కథలు