హోమ్ /వార్తలు /సినిమా /

భారత సైనికుల సంక్షేమ నిధికి రూ.కోటి విరాళం ప్రకటించిన లతా మంగేష్కర్

భారత సైనికుల సంక్షేమ నిధికి రూ.కోటి విరాళం ప్రకటించిన లతా మంగేష్కర్

<span style="color: #ff0000;">9. లతా మంగేష్కర్‌తో పని చేయని సంగీత దర్శకుడు:</span>
తన సుదీర్ఘ కెరీర్‌లో లతా ఎంతోమంది గొప్ప భారతీయ సంగీత దర్శకులతో కలిసి పని చేసారు. కానీ ఆమె ఎప్పుడూ OP నయ్యర్‌తో కలిసి పని చేయలేదు.

<span style="color: #ff0000;">9. లతా మంగేష్కర్‌తో పని చేయని సంగీత దర్శకుడు:</span> తన సుదీర్ఘ కెరీర్‌లో లతా ఎంతోమంది గొప్ప భారతీయ సంగీత దర్శకులతో కలిసి పని చేసారు. కానీ ఆమె ఎప్పుడూ OP నయ్యర్‌తో కలిసి పని చేయలేదు.

తాజాగా పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవానుల కుటుంబాలకు సాయం అందించేందకు ఒక్కొక్కరుగా దాతలు ముందుకు వస్తున్నారు. తాజాగా భారత రత్నలతా మంగేష్కర్..పుల్వామా ముష్కరదాడిలో కన్నుమూసిన సైనికుల కుటుంబానికి రూ.కోటీ విరాళాన్ని ప్రకటించారు.

ఫిబ్రవరి  14న సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లను పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరులు కాశ్మీర్‌లోని పుల్వామా దగ్గర దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే కదా.  ఈ దాడిలో కన్నుమూసిన సైనికుల కోసం కాశ్మీర్ టూ కన్యాకుమారి వరకు దేశ వ్యాప్తంగా ప్రజలందరు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు 40 మంది వీర జవాన్ల మరణానికి ధీటైన సమాధానం కోసం భారత దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. తాజాగా వీర జవానుల వీర మరణంపై భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకారం తీర్చుకుంది.

మంగళవారం తెల్లవారుఝామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ వెంట ఉన్న ఉగ్ర స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన 300 మంది పైగా ముష్కరులు హతమైనట్టు సమాచారం. అంతేకాదు భారత వైమానిక దాడులతో పాకిస్థాన్ బెంబెలెత్తిపోతుంది. ఈ దాడిపై దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క పౌరుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవానుల కుటుంబాలకు సాయం అందించేందకు ఒక్కొక్కరుగా దాతలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ..ఉగ్ర దాడిలో కన్నుమూసిన సైనిక కుటుంబాలకు రూ.25 లక్షల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి తోచిన సాయాన్ని వారు చేస్తున్నారు.

తాజాగా భారత రత్నలతా మంగేష్కర్..పుల్వామా ముష్కరదాడిలో కన్నుమూసిన సైనికుల కుటుంబానికి రూ.కోటీ విరాళాన్ని ప్రకటించారు. తన తండ్రి దీనానాథ్ మంగేష్కర్ వర్థంతి సందర్భంగా ఏప్రిల్ 24న వీర జవానుల కుటుంబాలకు ఆ మొత్తాన్ని అందజేయనున్నట్టు సమాచారం.

First published:

Tags: Bollywood, Hindi Cinema, Lata Mangeshkar, Pm modi, Pulwama Terror Attack, Surgical Strike 2

ఉత్తమ కథలు