• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PUJITA PONNADA WILL BE SEEN IN A ITEM SONG FOR PAWAN KALYAN KRISH NEW MOVIE SR

ఐటెమ్ సాంగ్‌లో రంగస్థలం హీరోయిన్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజిత..

ఐటెమ్ సాంగ్‌లో రంగస్థలం హీరోయిన్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజిత..

పూజిత పొన్నాడ Photo : Twitter

Pujita Ponnada : పూజిత పొన్నాడ.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలంలో ఆది పినిశెట్టికి లవ్ ఇంట్రెస్ట్‌గా చేసిన సంగతి తెలిసిందే.

  • Share this:
    Pujita Ponnada : పూజిత పొన్నాడ.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలంలో ఆది పినిశెట్టికి లవ్ ఇంట్రెస్ట్‌గా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ భామకు ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి. అందులో భాగంగా పూజిత 'వేర్ ఈజ్ వెంకట లక్ష్మి', 'బ్రాండ్ బాబు', 'సెవెన్' కల్కి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న ఈ భామకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ భారీ చారిత్రక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆంగ్లేయుల కాలంలో పేదల కోసం దోపిడీలు చేసే పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఈ సినిమా కథ రాబిన్ హుడ్ తరహాలో సాగుతుందని సమాచారం. కాగా ఈ సినిమాలో ఓ పాటలో తెలుగమ్మాయి పూజిత కనిపించనుందట. అంతేకాదు ఓ భారీ సెట్ లో ఇప్పటికే ఈ పూజితపై సాంగ్ షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పాపులర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. హిందీ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్‌ పవన్ సరసన నటించనుంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న విరూపాక్ష షూటింగ్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం వాయిదా పడింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు