Home /News /movies /

PUHSPA HINDI COLLECTIONS ALLU ARJUN PUSHPA HINDI AND OTHER LANGUAGES COLLECTIONS TA

Allu Arjun - Pushpa : హిందీ వెర్షన్‌లో కుమ్మేస్తేన్న ‘పుష్ప’ మూవీ.. కలెక్షన్స్ విషయంలో తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్..

అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ కలెక్షన్స్ (Twitter/Photo)

అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ కలెక్షన్స్ (Twitter/Photo)

Allu Arjun - Pushpa Hindi Collections : ఐకాన్ స్టార్  అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్  సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ (Pushpa).  ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది.

ఇంకా చదవండి ...
    Allu Arjun - Pushpa Hindi Collections : ఐకాన్ స్టార్  అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్  సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ (Pushpa).  ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈమూవీ  నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్‌ మంచి వసూళ్లనే దక్కించుకుంది. నార్త్‌లో పుష్ప రాజ్ తన సత్తాను చాటుతున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టింది.  అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప.

    మొత్తంగా హిందీలో 24 రోజుల్లో..  రూ. 37.45 కోట్ల షేర్ (రూ. 80.48 కోట్టు గ్రాస్) వసూళ్లు  రాబట్టింది. హిందీలో ఆదివారం రూ. 1.25 షేర్ (రూ. 3.48 కోట్ల గ్రాస్ )వసూళ్లు సాధించింది. ఇక మన దేశంలో నార్త్ రీజియన్‌లో ఇరగదీస్తోంది. మొత్తంగా హిందీ వెర్షన్ మొత్తం రూ. 100 కోట్ల గ్రాస్‌కు చేరువలో ఉంది. ఆల్రెడీ తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మంచి వసూళ్లనే రాబడుతోంది.

    HBD Allu Aravind : హ్యాపీ బర్త్ డే అల్లు అరవింద్‌.. బావ చిరంజీవితో ఈయనది బ్లాక్ బస్టర్ కాంబినేషన్..


    మొత్తంగా రూ. 314.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు 2021 లో అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ క్రాస్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. బాహుబలి, 2.O, 'సాహో’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో 24వ రోజు  రూ. 19 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక హిందీ, ఓవర్సీస్, మిగతా భాషల్లో కలిపి ఈ సినిమా రూ. 1.89 కోట్లు వసూళ్లు సాధించింది.


    ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు రూ. 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రెండు రోజులకి గాను పుష్ప సినిమా రూ. 116 కోట్ల భారీ వసూళ్లను అందుకున్నట్టుగా తెలిపారు. ఈ సినిమా 24 రోజులకు  గాను ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూళు చేసిందంటే..

    Unstoppable with NBK : లయన్ షోలో లైగర్.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో అర్జున్ రెడ్డి Vs సమరసింహా రెడ్డి..

    నైజాం (తెలంగాణ): 40.50 కోట్లు (వచ్చింది)/ 36.00 (అమ్మింది)
    సీడెడ్ (రాయలసీమ): 14.97 కోట్లు / 18 కోట్లు
    ఉత్తరాంధ్ర: 8.02 కోట్లు / 12.25 కోట్లు
    ఈస్ట్: 4.86 కోట్లు / 8 కోట్లు
    వెస్ట్: 3.94 కోట్లు / 7 కోట్లు
    గుంటూరు: 5.07 కోట్లు / 9 కోట్లు
    కృష్ణా: 4.21 కోట్లు / 7.5 కోట్లు
    నెల్లూరు: 3.08కోట్లు / 4 కోట్లు

    ఏపీ-తెలంగాణ టోటల్: 84.65 కోట్లు / 101.75 కోట్లు మొత్తంగా రూ. 132 కోట్లు) గ్రాస్ కలెక్షన్స్..
    తమిళనాడు: 10.70కోట్లు / 6 కోట్లు
    కర్ణాటక: 11.45 కోట్లు / 9 కోట్లు
    హిందీ: 37.45 కోట్లు / 10 కోట్లు
    ఓవర్సీస్: 14.25 కోట్లు / 13 కోట్లు
    రెస్టాఫ్ ఇండియా: 2.22 కోట్లు / 1.15 కోట్లు
    కేరళ: 5.40 కోట్లు / 4 కోట్లు
    24 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 166.20 కోట్లు (314.50 కోట్లు గ్రాస్) / 144.90 కోట్లు

    ’పుష్ప’లో అల్లు అర్జున్ (Twitter/Photo)


    పుష్ప సినిమాకు రూ.  145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో ఏపీలో పలు ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. ఓవరాల్‌గా లాభాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్ ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 24 రోజుల్లో  ఈ సినిమాకు రూ.  166.20 కోట్ల షేర్ వచ్చింది. మరోవైపు హిందీ తప్ప మిగతా భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. హిందీలో ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఎపుడనేది త్వరలో ప్రకటించనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Bollywood news, Pushpa Movie, Tollywood

    తదుపరి వార్తలు