Home /News /movies /

PUDUCHERRY THEATRE SCREEN CATCHES FIRE DURING KAMAL HAASAN MOVIE VIKRAM CLIMAX AUDIENCE RUSH OUT OF THE HALL SK

Vikram: 'విక్రమ్' థియేటర్‌లో కలకలం..తెరపై సూర్య కనిపించగానే.. చెలరేగిన మంటలు.. ఏం జరిగింది?

తగలబడుతున్న థియేటర్

తగలబడుతున్న థియేటర్

Vikram Movie: మంగళవారం రాత్రి పుదుచ్చేరిలో తీవ్ర కలకలం రేగింది. విక్రమ్ సినిమా నడుస్తున్న సినిమా థియేటర్లో మంటలు ఎగిసిపడ్డాయి. క్లైమాక్స్ సూర్య ఎంట్రీ ఇచ్చిన కాసేపటికే మంటలు చెలరేగాయి.

    కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన విక్రమ్ మూవీ (Vikram Movie) హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.  బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల విషయంలోనూ కుమ్మేస్తోంది.  చాలా ఏళ్ల తర్వాత లోకనాయకుడికి పర్‌ఫెంట్ పడిందని ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ.. ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) తెరపై మ్యాజిక్ చేశారు. కమల్ హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫాహద్ ఫాజిల్ (Fahad fazil),  సూర్య (Suriya) వంటి సూపర్ స్టార్లున్న విక్రమ్ మూవీ.. హాలీవుడ్ రేంజ్‌లో ఉందని ఫ్యాన్స్‌  ఖుషీ అవుతున్నారు. ఇంకా చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులతో థియేటర్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పుదుచ్చేరిలో తీవ్ర కలకలం రేగింది.



    పుదుచ్చేరిలోని కాలాపేట్‌లో ఉన్న జయా సినిమా హాల్‌లో కూడా విక్రమ్ సినిమానే నడుస్తోంది. ఐతే నిన్న రాత్రి ఫస్ట్ షో జరుగుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. విక్రమ్ సినిమాలో సూర్య క్యామియో రోల్ పోషించాడు. మూవీ క్లైమాక్స్‌లో సూర్య కనిపించడంతో.. అయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న జయా థియేటర్లో సూర్య ఎంట్రీ సమయంలో మంటలు చెలరేగాయి. క్లైమాక్స్‌లో సూర్య తెరపై కనిపించగానే.. మంటలు ఎగిపిపడ్డాయి. స్క్రీన్ ఒక వైపు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ మంటలను చూసి ప్రేక్షకులు భయడిపోయారు. థియేటర్ నుంచి పరుగులు తీశారు. ఐతే థియేటర్ యాజమాన్యం, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపుచేశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

    Mahesh Babu: మరో బిగ్ మల్టీస్టారర్.. స్టార్ హీరో సినిమాలో మహేష్ బాబు..

    ''దాదాపు 70 మంది సినిమాను చూస్తున్నారు. క్లైమాక్స్ సమయంలో తెరకు ఒక వైపు నుంచి మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. వెంటనే సినిమాను నిలిపివేసి.. ప్రేక్షకులను బయటకు పంపించాం. అగ్నిమాపక శాఖ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పాం. వెంటనే వారు ఫైరింజన్లను పంపించారు. ఆ తర్వాత తక్కువ సమయంలోనే మంటలను అదుపుచేశారు. కానీ అప్పటికే స్క్రీన్ మొత్తం కాలిపోయింది. హాల్‌లోని ఇతర ఫర్నిచర్‌కు ఎలాంటి నష్టం జరగలేదు.'' అని థియేటర్ యాజమాన్యం వెల్లడించింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలను సేకరించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఐతే ఇందులో మరో కోణం కూడా వినిపిస్తోంది. సూర్య అభిమానులు కర్పూరం వెలిగించారని, బాణాసంచా పేల్చారని.. అందువల్లే మంటలు చెలరేగాయని కొందరు చెబుతున్నారు. అసలు.. ఏం జరిగిందన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.

    ఇక విక్రమ్ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాతి నుంచి కూడా అదే దూకుడును కొనసాగిస్తోంది. ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా తెలుగు రైట్స్‌ను యువ నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్పుడే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Kollywood, Tamil Cinema, Tamilnadu, Vikram Movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు