Home /News /movies /

PSPK27 PAWAN KALYAN KRISH MOVIE MAY CONSIDER OLD MOVIE TITLES BANDIPOTU GAJA DONGA AND OM SHIVAM TA

PSPK27: పవన్ కళ్యాణ్, క్రిష్ మూవీకి మరో ఆసక్తికర టైటిల్.. ?

PSPK27 పవన్ కళ్యాణ్, క్రిష్ చిత్రానికి కొత్త టైటిల్ (Twitter/Photo)

PSPK27 పవన్ కళ్యాణ్, క్రిష్ చిత్రానికి కొత్త టైటిల్ (Twitter/Photo)

PSPK 27 | పవన్ కళ్యాన్, క్రిష్‌తో చేస్తోన్న చిత్రానికి ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి మరో పవర్ఫుల్ టైటిల్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడులైన రెండు లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత క్రిష్ చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ కంప్లీటైంది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని క్రిష్ చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు.  కోహినూర్ వజ్రం నాటి కథతో వస్తున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను క్రిష్ పాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నాడు.

    PSPK 27 (Twitter/Photo)


    ముందుగా కమర్షియల్ అంశాల జోలికి వెళ్లొద్దని అనుకున్నాడు కానీ..   కానీ క్రిష్.. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉండేటట్టు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ముందుగా ‘విరూపాక్ష’ అనే టైటిల్ అనుకున్నారు. ఈ టైటిల్ మాస్‌లో అంతగా పేలలేదు.

    పవన్ కళ్యాణ్, క్రిష్ (Pawan Kalyan Krish)
    పవన్ కళ్యాణ్, క్రిష్ (Pawan Kalyan Krish)


    అందుకే కథ ప్రకారం ఈ సినిమాకు మాస్‌లో బాగా ఎలివేట్ అయ్యే టైటిల్ పెట్టాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ సినిమాను సీనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ టైటిల్స్ ‘బందిపోటు’ లేదా ‘గజదొంగ’ అనే టైటిల్స్ పెడితే ఎలా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    PSPK 27 (Twitter/Photo)


    మొత్తంగా పవన్ కళ్యాణ్, క్రిష్ మాత్రం ఈ సినిమాకు ‘గజ దొంగ’ లేదా ’బందిపోటు’ఈ రెండు పేర్లు వినిపించాయి. కథ ప్రకారం ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి ‘ఓం శివమ్’ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినబడుతోంది.

    పవన్ కళ్యాణ్ (twitter/Pawan Kalyan)
    పవన్ కళ్యాణ్,క్రిష్ (twitter/Pawan Kalyan)


    ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఆల్మొస్ట్ కన్ఫామ్ చేసారు. మరోవైపు పవన్ కళ్యాణ్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ నటిస్తున్నట్టు సమాచారం. ముందుగా కథ ప్రకారం ఈ చిత్రంలో కేవలం రెండు పాటలు మాత్రమే పెట్టాలనుకున్నారు. కానీ క్రిష్ మాత్రం మరో మూడు పాటలను కలిపి మొత్తంగా ఐదు పాటలు ఉండేలా ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం  నిర్మిస్తున్నాడు.వచ్చే యేడాది ఈ చిత్రం విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Krish, Pawan kalyan, PSPK 27, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు