PSPK26FirstLook : పవన్ కళ్యాణ్, ఓ వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటూనే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించాడు. అందులో భాగంగా MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో నివేదా థామస్, అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోందని సమాచారం. ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కల్యాణ్ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర సంగీత దర్శకుడు థమన్.. ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించాడు. తాజాగా చిత్ర బృందం మార్చి 2 సాయత్రం 5 గంటలకు పవన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నామని కన్ఫామ్ చేసింది. మరోవైపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న ఫస్ట్సాంగ్ను విడుదల చేయనున్నారని సమాచారం.
— Sri Venkateswara Creations (@SVC_official) March 1, 2020
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.