PSPK 27 POWER STAR PAWAN KALYAN RANA DAGGUBATI MOVIE LATEST UPDATE HERE ARE THE DETAILS TA
PSPK 27: పవన్ కళ్యాణ్ కొత్త సినిమాపై క్రేజీ అప్డేట్.. పవర్ స్టార్ సినిమా కోసం రంగంలోకి త్రివిక్రమ్..
పవన్ కళ్యాణ్ 27వ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తోన్న త్రివిక్రమ్ (Twitter/Photo)
PSPK 27: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసాడు. నిన్న సంక్రాంతి పండగ సందర్భంగా ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేస్తే.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా పవన్ కళ్యాణ్.. తన లేటెస్ట్ మూవీకి సంబంధించిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
PSPK 27: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసాడు. నిన్న సంక్రాంతి పండగ సందర్భంగా ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేస్తే.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిసారి లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయాల్సి ఉన్నా.. ముందుగా మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. మల్లూవుడ్‌లో బిజూ మీనన్, పృథ్వీరాజ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బిజూ మీనన్ పాత్రలో నటిస్తుండగా.. రానా దగ్గుబాటి పృథ్వీరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారని సమాచారం.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ను కనుమ పండగ సందర్భంగా ఈ రోజు సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రకటన చేసారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘స్క్రీన్ ప్లేతో పాటు మాటల అందించనున్నారు. త్రివిక్రమ్ దర్శకుడైన తర్వాత వేరే దర్శకుడి చిత్రానికి మాటలు రాయడం ఇది రెండోసారి. గతంలో పవన్ కళ్యాణ్ .. ‘తీన్మార్’ సినిమాకు త్రివిక్రమ్ మాట సాయం అందించారు. ఇపుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేతో పాటు మాటలు రాస్తున్నారు. దీంతో పాటు గుణశేఖర్.. ‘శాకుంతలం’తో పాటు అల్లు అరవింద్ తెరకెక్కించనున్న ‘రామాయణం’ సినిమాకు కూడా త్రివిక్రమ్ మాటలు రాయడం కంప్లీటైంది. మొత్తంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగానే కాకుండా.. మాటల రచయతగా మరోసారి తన కలం బలం ఏమిటో చూపిస్తున్నారు.
ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా .. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటకే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో విశాలమైన లాడ్జ్ సెట్‌ను వేసారు. జనవరి 20 నుంచి కంటిన్యూగా 25 రోజులు పాటు ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్,రానా లపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో రానా, పవన్ కళ్యాణ్ పై దాదాపు 70 శాతం తెరపై కలిసి కనిపించనున్నారు. ఈ సినిమాకు బిల్లా రంగా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. దాదాపు అదే ఖాయం అయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా పవన్ కళ్యాన్ 27వ సినిమాకు త్రివిక్రమ్ .. కథ, స్క్రీన్ ప్లేతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.