PSPK 27: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసాడు. నిన్న సంక్రాంతి పండగ సందర్భంగా ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేస్తే.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిసారి లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయాల్సి ఉన్నా.. ముందుగా మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. మల్లూవుడ్‌లో బిజూ మీనన్, పృథ్వీరాజ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బిజూ మీనన్ పాత్రలో నటిస్తుండగా.. రానా దగ్గుబాటి పృథ్వీరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారని సమాచారం.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ను కనుమ పండగ సందర్భంగా ఈ రోజు సాయంత్రి 6.03 నిమిషాలకు ప్రకటించనున్నారు. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల చేస్తారా.. లేకపోతే.. టైటిల్ అనౌన్స్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా .. సంక్రాంతి తర్వాత ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటకే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో విశాలమైన లాడ్జ్ సెట్‌ను వేసారు. జనవరి 20 నుంచి కంటిన్యూగా 25 రోజులు పాటు ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్,రానా లపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో రానా, పవన్ కళ్యాణ్ పై దాదాపు 70 శాతం తెరపై కలిసి కనిపించనున్నారు. ఈ సినిమాకు బిల్లా రంగా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. దాదాపు అదే ఖాయం అయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా కనుమ పండగ రోజున అభిమానులకు పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఏ విషయాన్ని పంచుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 15, 2021, 14:56 IST