హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Vishnu: మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ఏం చేస్తాడు అన్నారు? పృథ్వీ కీలక వ్యాఖ్యలు

Manchu Vishnu: మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ఏం చేస్తాడు అన్నారు? పృథ్వీ కీలక వ్యాఖ్యలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డీల్ చేయడం చాలా సింపుల్ థింగ్ అన్నారు ఫృథ్వీ రాజ్. ఏఐజీ ఆస్పత్రిలో ఆర్టిస్టులకు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా పృథ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘మా’ సభ్యుల కోసం ఆదివారం హైదరాబాద్‌(Hyderabad)లోని ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital)లో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మా ప్రెసిడెంట్‌తో పాటు.. పలువురు మా సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన థర్ట్ ఇయర్స్ పృథ్వి... మా ప్రెసిడెంట్ విష్ణుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు(Manchu Vishnu) మా(MAA) ప్రెసిడెంట్ అయినప్పుడు ఏం చేస్తాడు... ఎలా చేస్తాడు అని... అందరికీ మిలియన్ డాలర్ల సందేహాలు వచ్చాయన్నారు. ఏం చేస్తాడు అని చాలా రకాలుగా మాట్లాడాడు. ఈ టీంలో ముందు నేను ఇక్కడకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఫృథ్వీ(Prudhvi Raj). మంచు విష్ణు ఓ హీరోగా అందరికీ తెలుసున్నారు. కానీ ఆయనకు ఎడ్యుకేషన్లు ఇనిస్టిట్యూట్లు చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాలంటే ఓగంట సరిపోదన్నారు. అవన్నీ డీల్ చేసినోళ్లకు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డీల్ చేయడం చాలా సింపుల్ థింగ్ అన్నారు ఫృథ్వీ.

మంచు విష్ణు(Manchu Vishnu) ఓ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నాడన్నారు. ముందుగా ఆరోగ్యం అవకాశాలు ఇవి చాలా అద్భుతంగా చేశారన్నారు. మెడికల్ చెకప్ లాస్ట్ టైం కూడా జరిగిందన్నారు. షూటింగుల సమయంలో నేనే వెళ్లిన ప్రతీచోటకు ఆర్టిస్టులు చెప్పే ఫీడ్ బ్యాక్ మంచు విష్ణుకు తెలియజేస్తామన్నారు. ఇక ఏఐజీ డాక్టర్లపై కూడా ఫృథ్వీ ప్రశంసలు కురిపించారు. ఏఐజీ డాక్టర్లు ఆస్పత్రికి వచ్చిన ఆర్టిస్టులకు.. పెళ్లికి వచ్చిన అతిథులకు పలికేలా ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు. ఆస్పత్రి సిబ్బంది చెకప్‌లు కూడా దగ్గిరుండి చేస్తున్నారన్నారు.

మరోవైపు మంచు విష్ణు మాట్లాడుతూ... ‘మా’ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు అసోసియేషన్‌కు శాశ్వత భవనం నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మరో ఆరు నెలల్లో ‘మా’ శాశ్వత భవనానికి భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. ‘మా’ సభ్యుల వెల్పేర్, హెల్త్ తన ప్రధాన కర్తవ్యమని చెప్పారు. ‘మా’ సభ్యుల కోసం ఆదివారం హైదరాబాద్‌(Hyderabad)లోని ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital)లో వైద్య శిబిరాన్ని నిర్వహించిన నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు. ఇక సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో తాను గతంలో మాట్లాడకపోవడాన్ని మళ్లీ సమర్థించుకున్నారు ‘మా’ ఛైర్మన్ విష్ణు. టిక్కెట్ల పెంపు కరెక్టా కాదా అనే అంశంపై చర్చ జరగాల్సిందే అన్నది ఆయన మాట. దీని గురించి, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌, ఫిల్మ్‌ ఛాంబర్‌ అందరూ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందన్నారు.

First published:

Tags: 30 Years Prudhvi Raj, MAA, MAA Association

ఉత్తమ కథలు