RRR వల్ల మా బంధానికి దిష్టి తగలకూడదని కోరుకుంటున్నా... - ఎన్.టీ.ఆర్

జక్కన్నతో సినిమా అంటే ఎంతో నమ్మకం, ఏదో తెలియని ఎనర్జీ వస్తాయి... జక్కన్నతో పాటు నా ఫ్రెండ్ రామ్‌చరణ్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది... ఈ ఇద్దరితో బాండింగ్ ఈ సినిమా వల్ల చెడిపోకూడదని కోరుకుంటున్నా... RRR ప్రెస్‌మీట్‌లో తారక్

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 15, 2019, 5:43 PM IST
RRR వల్ల మా బంధానికి దిష్టి తగలకూడదని కోరుకుంటున్నా... - ఎన్.టీ.ఆర్
జూనియర్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
RRR... తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతదేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. ఆర్ఆర్ఆర్ అంటే పూర్తి పేరు ఏంటి? హీరోయిన్స్ ఎవరు? కథ ఏంటి? అనేది ఇన్నాళ్లు సస్పెన్స్‌గానే ఉండింది. RRR అంటే ‘రామరావణ రాజ్యం’ అని కొందరు, కాదు... RRR అంటే ‘రఘుపతి రాఘవ రాజారాం’ అని మరికొందరు ఎవ్వరికి నచ్చినట్టు వారు ఊహించుకున్నారు. అయితే ఎట్టకేలకు ప్రెస్‌మీట్ పెట్టి ప్రేక్షకులకు ఉన్న అన్ని అనుమానాలకు క్లారిటీ ఇచ్చేశాడు సంచలన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ నటించబోతున్నట్టు ప్రకటించి... అందర్నీ ఆశ్చర్యంలో పడేశాడు జక్కన్న.

rrr,RRR movie,rrr movie cast and crew, RRR movie updates, RRR Pressmeet, rrr pressmeet ntr speech, jr ntr speech in rrr movie pressmeet, RRR Ramcharan Role,RRR Jr NTR Role, RRR Ajay devgan role, RRR movie release date, RRR full name in telugu, SS Rajamouli movies list, RRR Alia bhatt romancing with Ramcharan, Young Tiger ntr role in RRR, telugu movie updates, ఆర్ఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ తెలుగు మూవీ అప్‌డేట్స్, RRR మూవీ రిలీజ్ డేట్, RRR మూవీ ఎన్.టీ.ఆర్ హీరోయిన్, ఆర్ఆర్ఆర్ మూవీ హీరో ఎన్టీఆర్ రోల్ కొమరం భీమ్, తెలుగు సినిమా, ఎస్ఎస్ రాజమౌళి, రామ్‌చరణ్
ప్రారంభోత్సవంలో రాజమౌళి, రామ్‌చరణ్, దానయ్యలతో తారక్

మెగా ఫ్యాన్స్, నందమూరి అభిమానులు అనే తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులు, ఇండియన్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ముగ్గురు స్టార్స్ కలిసి దిగిన ఒక్క ఫోటోతో ఊహాత్మకంగా మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు కార్యరూపం దాల్చి, ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్‌గా మారింది. తాజాగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌తో రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టేశారు సినిమా యూనిట్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్... తన పాత్ర గురించి, తనతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ గురించి, సంచలన దర్శకుడు రాజమౌళి గురించి చెప్పుకొచ్చాడు.

rrr,RRR movie,rrr movie cast and crew, RRR movie updates, RRR Pressmeet, rrr pressmeet ntr speech, jr ntr speech in rrr movie pressmeet, RRR Ramcharan Role,RRR Jr NTR Role, RRR Ajay devgan role, RRR movie release date, RRR full name in telugu, SS Rajamouli movies list, RRR Alia bhatt romancing with Ramcharan, Young Tiger ntr role in RRR, telugu movie updates, ఆర్ఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ తెలుగు మూవీ అప్‌డేట్స్, RRR మూవీ రిలీజ్ డేట్, RRR మూవీ ఎన్.టీ.ఆర్ హీరోయిన్, ఆర్ఆర్ఆర్ మూవీ హీరో ఎన్టీఆర్ రోల్ కొమరం భీమ్, తెలుగు సినిమా, ఎస్ఎస్ రాజమౌళి, రామ్‌చరణ్
RRR పోస్టర్

‘జక్కన్నతో ఇది నాకు నాలుగో సినిమా. ఆయనతో సినిమా అంటే ఎంతో నమ్మకం, గుండె ధైర్యం వస్తాయి. అయితే మొదటిసారి ఎందుకో కాస్త భయంగా ఉంది. ఒక్కటి మాత్రం చెప్పగలను ఈ సినిమా నా కెరీర్‌లో స్పెషల్ చిత్రంగా మిగిలిపోతుంది. నా కెరీర్‌లోనే కాదు రామ్‌చరణ్, జక్కన్న, దానయ్య అందరి కెరీర్‌లోనూ వన్ ఆఫ్ స్పెషల్ మూవీ ఆర్ఆర్ఆర్. జక్కన్నతో పాటు నా ఫ్రెండ్ రామ్‌చరణ్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. మా ఇద్దరి మధ్య బాండింగ్ ఇప్పుడు మొదలైంది కాదు. నాకు ఇండస్ట్రీలో తెలిసిన మంచి స్నేహితుల్లో చరణ్ ఒకడు. నాకు కష్టం వచ్చినా, ఆనందం కలిగినా జక్కన్నతో పాటు రామ్‌చరణ్‌తో కూడా పంచుకుంటాను. ఈ సినిమా వల్ల మా మధ్య అనుబంధం మరో లెవెల్‌కు వెళ్లిపోయింది. సినిమా విడుదలైన తర్వాత కూడా మేము ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా... ఎందుకంటే మంచి బంధాలు వచ్చినప్పుడే దిష్టం తగులుతుందని మా అమ్మ చెబుతూ ఉంటుంది. ఈ సినిమాకీ, మా మధ్య బంధానికి ఎప్పుడూ దిష్టి తగలకూడదని కోరుకుంటున్నా...’ అని చెప్పుకొచ్చాడు ఎన్.టీ.ఆర్

rrr,RRR movie,rrr movie cast and crew, RRR movie updates, RRR Pressmeet, rrr pressmeet ntr speech, jr ntr speech in rrr movie pressmeet, RRR Ramcharan Role,RRR Jr NTR Role, RRR Ajay devgan role, RRR movie release date, RRR full name in telugu, SS Rajamouli movies list, RRR Alia bhatt romancing with Ramcharan, Young Tiger ntr role in RRR, telugu movie updates, ఆర్ఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ తెలుగు మూవీ అప్‌డేట్స్, RRR మూవీ రిలీజ్ డేట్, RRR మూవీ ఎన్.టీ.ఆర్ హీరోయిన్, ఆర్ఆర్ఆర్ మూవీ హీరో ఎన్టీఆర్ రోల్ కొమరం భీమ్, తెలుగు సినిమా, ఎస్ఎస్ రాజమౌళి, రామ్‌చరణ్
ప్రెస్‌మీట్‌లో తారక్, చెర్రీ

ఎస్ఎస్ రాజమౌళితో కలిసి ఇప్పటికే మూడు బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించాడు తారక్. తన కెరీర్‌లో మొదటి హిట్ చిత్రం ‘స్టూడెంట్ నెం.1’తో పాటు ఎన్.టీ.ఆర్‌ను స్టార్ హీరోగా మార్చిన ‘సింహాద్రి’, ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న తారక్‌కు ‘యమదొంగ’ సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు రాజమౌళి. రామ్‌చరణ్‌కి కెరీర్‌లో రెండో సినిమా ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్‌ను అందించిన రాజమౌళి... ఇండియన్ సినిమాలో అద్భుత విజయాన్ని అందుకున్న ‘బాహుబలి’ సినిమాల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై అంచనాలు మామూలుగా లేవు. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెడుతోంది చిత్ర బృందం. దాదాపు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూలై 30, 2020లో విడుదలకు సిద్ధమవుతోంది.ఎన్.టీ.ఆర్ ఫుల్ స్పీచ్ వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...

VIDEO: ఇద్దరు స్నేహితులతో కలిసి ఇష్టంగా చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్... - తారక్

First published: March 15, 2019, 3:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading