Hero Ram- Director Anudeep: స్పీడు పెంచిన హీరో రామ్... ప్రముఖ బ్యానర్ లో సినిమాకు ఓకే

Production house Vyjayanti movies planned for a movies hero ram and anudeep

Hero Ram- Director Anudeep: హీరో రామ్, డైరెక్టర్ అనుదీప్ కాంబినేషన్‌లో ఓ సినిమాను రూపొందించడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ క్ర‌మంగా త‌న మార్కెట్‌ను పెంచుకునే ప‌నిలో బిజి బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా చేయ‌డానికి ఓకే చేప్పేశాడు. సినిమా కూడా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇది కాకుండా మ‌రో సినిమాలో కూడా రామ్ న‌టించ‌డానికి ఓకే చెప్పిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు హీరో రామ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లో ప‌నిచేయ‌డానికి ఓకే చెప్పాడ‌ట‌. ఇంత‌కీ ఆ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏదో తెలుసా? వైజ‌యంతీ మూవీస్‌. సీనియ‌ర్ నిర్మాత అశ్వినీద‌త్ నిర్మిస్తున్నాడు. ఇప్పుడు జాతిర‌త్నాలు సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో అశ్వినీద‌త్‌, ఆయ‌న కుమార్తెలు స్వ‌ప్న‌, ప్రియాంక ద‌త్‌లు సినిమాను నిర్మించ‌బోతున్నార‌ట‌.

    రీసెంట్‌గా అనుదీప్ చెప్పిన క‌థ రామ్‌కు కూడా న‌చ్చేసింద‌ట‌. లింగుస్వామి సినిమాతో పాటు అనుదీప్ సినిమాను కూడా కాస్త ఆటో ఇటో ట్రాక్ ఎక్కించేయ‌డానికి రామ్ ప్లాన్ చేసేశాడ‌ట‌. ఈ ఏడాది రెడ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రామ్‌కు ఆశించిన స్థాయి స‌క్సెస్ రాలేద‌నే మాట వాస్త‌వం. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని వ‌రుస సినిమాలు ప్లాన్ చేయ‌డ‌మే కాకుండా త‌న మార్కెట్‌ను పెంచుకునే ప‌నిలో భాగంగా ద్విభాషా చిత్రాల‌ను ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట రామ్‌. మ‌రి అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చేయ‌బోయే సినిమా తెలుగు మాత్ర‌మేనా, లేక తెలుగు మ‌రియు త‌మిళ భాష‌ల్లోనా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

    స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌లో జాతిర‌త్నాలు వంటి సినిమాతో మంచి హిట్‌ను సొంతం చేసుకున్న అనుదీప్ ఆ వెంట‌నే వైజ‌యంతీ మూవీస్‌లో రామ్‌తో సినిమా చేసే అవ‌కాశాన్ని అందుకోవ‌డం త‌న‌కు క‌లిసొచ్చే విష‌య‌మే. మ‌రి రామ్‌తో అనుదీప్ ఎలాంటి సినిమా చేస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.
    Published by:Anil
    First published: