Home /News /movies /

PRODUCERS PLANS TO BREAK THE SHOOTINGS FROM AUGUST 1ST SLB

Tollywood: మరోసారి షూటింగులకు బ్రేక్.. ఆ రోజు నుంచి బంద్ పాటించబోతున్నారా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓటీటీ వేదికల హవా పెరగడంతో థియేటర్స్ ఓపెన్ అయినా కూడా సినిమా హాల్ బాట పట్టే వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో చాలాచోట్ల థియేటర్స్ వెలవెలబోవడం లాంటి సీన్స్ ఎన్నో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం సినిమా షూటింగ్ బంద్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇంకా చదవండి ...
సినిమా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చూడటానికి రంగుల ప్రపంచమే అయినా సినిమా నిర్మాణాల్లో ఎన్నో ఇబ్బందులు దాగి ఉంటాయి. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి ఎంటరయ్యాక సినీ ఇండస్ట్రీ అతలాకుతలం అయింది. నెలలకొద్ది సినిమా థియేటర్స్ మూతబడటంతో ప్రేక్షకుల అభిరుచి క్రమంగా మారుతూ వచ్చింది. ఇంతలో ఓటీటీ (OTT) వేదికల హవా పెరగడంతో థియేటర్స్ ఓపెన్ అయినా కూడా సినిమా హాల్ బాట పట్టే వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో చాలాచోట్ల థియేటర్స్ వెలవెలబోవడం లాంటి సీన్స్ ఎన్నో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో రెండో మూడో తప్పితే థియేటర్స్‌లో గొప్పగా ఆడిన సినిమాలు లేవనే చెప్పుకోవాలి.

అయితే థియేటర్స్‌కి ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంపై నిర్మాతలు (Tollywood Producers), డిస్ట్రిబ్యూటర్లు (Distributers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిత్ర పరిశ్రమలోని పలు శాఖల కార్మికులు తమ తమ వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఒకవేళ వేతనాలు పెంచకుంటే షూటింగ్‌లు బంద్‌ చేస్తామని హెచ్చరించారు కూడా. నిర్మాతల మండలి ఎంటరై దీనికి పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వడంతో కార్మికులు వెనక్కి తగ్గారు. యధావిధిగా షూటింగ్‌లు జరుగుతున్నాయి కానీ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. ఈ పరిస్థితుల నడుమ ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్ ఆపేయాలని నిర్మాతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో వచ్చిన సమస్యలు, కరోనా తర్వాత థియేటర్ల పరిస్థితి రోజురోజుకి దిగజారుతున్న తీరుపై నిర్మాతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ కాస్ట్, కోవిడ్, ఓటీటీల విషయమై చర్చలు జరిపాకే తిరిజి షూటింగ్స్ మొదలుపెట్టాలని భావిస్తున్నారట.

ఈ విషయమై నిర్మాతల మండలి త్వరలోనే అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వనున్నట్లు ఫిలిం నగర్ నుంచి సమాచారం అందుతోంది. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఈ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే మూడు నెలలు షూటింగ్‌లు నిలిపివేసే ప్రతిపాదనలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బంద్ సినీ పరిశ్రమ మనుగడ కోసమే అని టాలీవుడ్ అగ్ర నిర్మాత ఒకరు చెబుతున్నారట. సో.. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.
Published by:Sunil Boddula
First published:

Tags: Telugu Film Producers Council, Tollywood, Tollywood Producers

తదుపరి వార్తలు