ఆ హీరోతో సినిమా చేస్తే... నిర్మాతలు వాటిని భరించాల్సిందే..?

సాధారణంగా ఒక పెద్ద హీరో తను ఒప్పుకున్న సినిమా పూర్తి చేసేందుకు కనీసం 10 నెలల సమయం పడుతుంది. ఆ పీరియడ్‌లో ఒకవేళ విరామం కావాలనుకుంటే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం ఆ హీరోకి అలవాటు.

news18-telugu
Updated: November 13, 2019, 9:07 AM IST
ఆ హీరోతో సినిమా చేస్తే... నిర్మాతలు వాటిని భరించాల్సిందే..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సినిమాలంటేనే కోట్లతో కూడిన వ్యవహారం. ముందు అనుకున్న బడ్జెట్‌కి.. సినిమా పూర్తయ్యే నాటికి అయ్యే బడ్జెట్‌కి అసలు పొంతన ఉండదు. అంతలా నిర్మాతలకు ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. ఓవైపు రెమ్యునరేషన్స్.. మరోవైపు షూటింగ్ ఖర్చు.. వీటికి తోడు హీరో హీరోయిన్ల స్టాఫ్‌ని కూడా నిర్మాతలే భరించాలి. ఇవి చాలదన్నట్టుగా.. ఓ తెలుగు హీరో తన ఫారిన్ టూర్స్ ఖర్చును కూడా నిర్మాతల పైనే రుద్దుతున్నాడట. ఆయన ఓ సినిమా ఒప్పుకున్నాడంటే.. మధ్యలో ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్లేందుకు నిర్మాతే ఖర్చు భరించాలట. ఏడాదికి నాలుగైదు సార్లు ఫారిన్ టూర్ వెళ్లే ఆ హీరో వల్ల నిర్మాతలకు మరింత భారం పడుతోందట.

సాధారణంగా ఒక పెద్ద హీరో తను ఒప్పుకున్న సినిమా పూర్తి చేసేందుకు కనీసం 10 నెలల సమయం పడుతుంది. ఆ పీరియడ్‌లో ఒకవేళ విరామం కావాలనుకుంటే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం ఆ హీరోకి అలవాటు.అయితే ఇందుకోసం విమాన ఖర్చుల దగ్గరి నుంచి హోటల్ ఖర్చు వరకు అంతా నిర్మాత పైనే అతను భారం వేస్తాడట. ఇండస్ట్రీలో ఆయనో పెద్ద హీరో కావడంతో ఆయన ఫారిన్ టూర్స్‌కు ఏ నిర్మాత అడ్డు చెప్పే సాహసం చేయట్లేదట. దీంతో సినిమా బడ్జెట్‌కు తోడు అదనంగా మరో ఒకటి లేదా రెండు కోట్లు నిర్మాతలకు ఖర్చవుతున్నాయట.
Published by: Srinivas Mittapalli
First published: November 13, 2019, 9:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading