PRODUCERS ARE PLANNING TO ALA VAIKUNTAPURAMULOO GRAND CELEBRATIONS FOR COMPLETING ONE YEAR MHN
Ala Vaikuntapuramuloo: ‘అల వైకుంఠపురములో...’ సక్సెస్ సెల్రబేషన్స్ కోసం నిర్మాతల ప్లాన్స్ ..!
Producers are planning to Ala Vaikuntapuramuloo Grand celebrations for completing one year
Ala Vaikuntapuramuloo - Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా ‘అల వైకుంఠపురములో’ సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాతలు సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసిన ఏడాది పూర్తి కావస్తుంది. ఈ ఏడాది సమయంలో ఆయన సినిమా చేసిన క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. తెలుగు సినిమా పరంగా ఈ సినిమా బన్నీ అభిమానులనే కాదు.. తెలుగు ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అల వైకుంఠపురములో..’. 2020, మార్చిలో కోవిడ్ కారణంగా సినిమా థియేటర్స్ మూత పడ్డాయి. అయితే ప్రేక్షకులు మిగిలిన కాస్తో కూస్తో సినీ ఆనందం ఏదైనా ఉందంటే.. అది జనవరి, ఫిబ్రవరి నెలలే. అందులో గత ఏడాది సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. జనవరి 12, 2020 న విడుదలైన ఈ చిత్రం.. రూ.260 కోట్లను వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసి బన్నీ స్టామినాను బాక్సాఫీస్ వద్ద చాటిన చిత్రమిది.
ఈ సినిమాను విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సెలబ్రేషన్స్‌ను చేయాలని భావిస్తున్నారట. ఈ సెలబ్రేషన్స్‌ను ఎలా చేయాలి? ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నారట నిర్మాతలు. ‘అల వైకుంఠపురములో..’ ఏడాది సెలబ్రేషన్స్ చేయాలా? లేక సింపుల్‌గా నిర్వహించాలా? అని ఆలోచిస్తున్నారు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
‘..’అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కావడానికంటే ముందే.. పాటలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. రాములో రాముల... , సామజవరగమన, బుట్టబొమ్మ... సాంగ్స్ ఆడియో పరంగా వందేసి మిలియన్స్ క్రాస్ చేసి రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక వీడియో సాంగ్స్ హవా కూడా అదే రేంజ్లో సాగింది. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్‌కు వార్నర్, శిల్పాశెట్టి వంటి క్రికెటర్స్, బాలీవుడ్ తారలు స్టెప్పులు కూడా వేశారు.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.