Venkatesh Narappa Movie: నార‌ప్పని వేరే హీరోతో చేద్దామ‌నుకున్న నిర్మాత‌.. వెంకటేశ్ సీన్‌లోకి ఎలా వ‌చ్చాడంటే?

నారప్పలో వెంకటేష్ (Twitter/Photo)

Venkatesh - Narappa Movie: నిర్మాత క‌లైపులి థాను ముందుగా నారప్ప సినిమాను మ‌రో హీరోతో చేయాల‌నుకున్నాడు. మ‌రి వెంటేశ్ చేయ‌డానికి కార‌ణ‌మేంటి..

  • Share this:
    విక్ట‌రీ వెంక‌టేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `నార‌ప్ప‌`. త‌మిళంలో ధ‌నుశ్ హీరోగా రూపొందిన `అసుర‌న్‌`కి ఇది రీమేక్‌. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాకు ఇద్ద‌రు నిర్మాత‌లు. ఒక‌రు త‌మిళ నిర్మాత క‌లైపులి థాను కాగా..మరో నిర్మాత డి.సురేష్‌బాబు. నిజానికి నార‌ప్ప సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామ‌ని అనుకున్న‌ప్పుడు క‌లైపులి థాను అనుకున్న హీరో మరొక‌రు. థాను స‌ద‌రు హీరోని కూడా సంప్ర‌దించాడ‌ట‌. కానీ హీరో అడిగిన రెమ్యున‌రేష‌న్ భారీగా ఉండ‌టంతో థాను ఇక వెంక‌టేశ్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ట‌. ఇంత‌కీ క‌లైపులి థాను సంప్ర‌దించిన టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా? మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అని టాక్‌. ముందుగా రామ్‌చ‌ర‌ణ్‌ను థాను సంప్ర‌దిస్తే చ‌ర‌ణ్‌ కూడా ఈ రీమేక్ చేయ‌డానికి ఆస‌క్తి చూపించారు. అయితే అప్పుడే చ‌రణ్ రంగ‌స్థ‌లం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ మీదున్నాడు. కాబ‌ట్టి.. దాదాపు ముప్పై కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ అడిగాడ‌ట‌. అంత మొత్తం రెమ్యున‌రేష‌న్ అంటే థానుకి ఏం చెప్పాలో తెలియ‌క. కామ్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ట‌. త‌ర్వాత వెంక‌టేశ్‌ను సంప్ర‌దించి రీమేక్‌లో న‌టించ‌డానికి ఓకే చేయించుకున్నాడు. అలా రామ్‌చ‌ర‌ణ్ చేయాల్సిన పాత్ర‌ను వెంక‌టేశ్ చేస్తున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

    తెలుగులో రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వెంకటేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వెంక‌టేశ్ లుక్‌కు సంబంధించిన‌ ఓ వీడియోను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నిజానికి ఈ చిత్రాన్ని ఇదే ఏడాది స‌మ్మర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు కానీ.. కరోనా వైర‌స్ ప్ర‌భావంతో చిత్రీక‌ర‌ణ ఆరేడు నెల‌ల పాటు వాయిదా ప‌డింది. రీసెంట్‌గానే షూటింగ్‌ను ప్రారంభించారు. త‌మిళంలో ధ‌నుశ్ భార్య‌గా మంజు వారియ‌ర్ చేసిన పాత్ర‌ను తెలుగులో వెంక‌టేశ్ స‌ర‌స‌న ప్రియ‌మ‌ణి చేస్తుంది. తెలుగులో ఈ సినిమాను వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేసే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాపై చాలా ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో హిట్ కొట్టి ఎలాగైనా డైరెక్ట‌ర్‌గా పొగొట్టుకున్న ఇమేజ్‌నంత‌టినీ సాధించాల‌ని అనుకుంటున్నాడు.

    వెంకేట‌శ్ ఈ సినిమాను పూర్తి చేయ‌గాగానే.. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్ 2 సీక్వెల్‌గా చేస్తున్న‌ ఎఫ్ 3 షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నాడు. ఎఫ్‌2లో న‌టించిన వారంద‌రూ ఎఫ్‌3లో న‌టిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
    Published by:Anil
    First published: