Home /News /movies /

PRODUCER VISHNU INDURI REVEALS REASON BEHIND NTR BIOPIC KATHANAYAKUDU AND MAHANAYAKUDU FLOP AK

ఎన్టీఆర్ బయోపిక్ అందుకే ఫ్లాప్... నిర్మాత మనోగతం

ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్లు

ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్లు

ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా కాకుండా ఒకే భాగంగా తీసి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదనే వాదన బలంగా వినిపించింది. తాజాగా ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    నందమూరి అభిమానులు సహా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరిచిన సినిమా ఎన్టీఆర్ బయోపిక్. కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమాలు... భారీ పరాజయాలను మూటగట్టుకున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆడియెన్స్‌ను ఈ రెండు సినిమాలు ఏ మాత్రం సంతృప్తి పరచలేకపోయాయి. అయితే ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా కాకుండా ఒకే భాగంగా తీసి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదనే వాదన బలంగా వినిపించింది. రెండు భాగాలుగా తెరకెక్కడం సినిమాపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందనే విశ్లేషకులు అంచనా వేశారు. తాజాగా ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    ఎన్టీఆర్‌ బయోపిక్‌ 60 శాతం చిత్రీకరణ పూర్తయిన తర్వాత రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించి తప్పు చేశామని ఓ ఇంటర్వ్యూలో విష్ణు ఇందూరి వ్యాఖ్యానించారు. అలా కాకుండా ఒకే పార్టుగా చెబితే ఫలితం మరోలా ఉండేదని అన్నారు. అయితే ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టడం లేదని వివరించారు. ఇది తామంతా కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. తన కెరీర్‌లో నేర్చుకున్న అత్యంత విలువైన పాఠం ఇదే అని తెలిపారు. దీనికి తోడు సినిమా విడుదల సమయంలో టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా ఎన్టీఆర్ బయోపిక్ పరాజయానికి మరో కారణమని విష్ణు ఇందూరి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విష్ణు ఇందూరి టాలీవుడ్‌లో క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న '83'తో పాటు జయలలిత బయోపిక్‌ తెలుగు వర్షన్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Balakrishna, NTR Biopic, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు