తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సురేష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారా ? అంటే ఔననే అంటున్నాయి సినీ రాజకీయా వర్గాలు.. వివరాల్లోకి వెళితే.. తెలుగు సినిమా చరిత్రను ఒక సారి పరిశీలిస్తే, ఆణిముత్యాల్లాంటి చిత్రాలు అందించిన సంస్థలను.. వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి సినిమాలను అందించిన సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్ కు తప్పక చోటు దక్కుతుంది. ఒక్క తెలుగులోనే కాదు. భారతీయ భాషల్లన్నింటిలోను చిత్రాలను అందించిన ఘనత ఈ నిర్మాణ సంస్థదే. ఆ నిర్మాణ సంస్థ అధినేతే డా.డి.రామానాయుడు.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను నిర్మించిన నిర్మాతగా.. గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించి సినీ రంగంలో దేశ అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. ఇక చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కు షిప్ట్ అయ్యాక రామానాయుడు తన పేరు మీద రెండు స్టూడియోలను కట్టారు. అందులో ఫిల్మ్ నగర్లో ఒకటి కాగా.. రెండోది నానక్ రామ్ గూడలోని రామానాయుడు సినీ విలేజ్ మరోకటి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Suresh Babu, Suresh Productions, Telangana, Telugu Cinema, Tollywood, Trs