గబ్బర్ సింగ్ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ వివాదం కూడా ఇప్పుడు ముదురుతుంది. అప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ హీరోయిన్ శృతి హాసన్‌తో పాటు నిర్మాత బండ్ల గణేష్ పేరు కూడా మర్చిపోయాడు. అయితే తర్వాత తన తప్పు తెలుసుకుని.. వాళ్లకు కూడా థ్యాంక్స్ చెప్పాడు. అయితే దీనిపై మాత్రం నిర్మాత బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. దాంతో ఇద్దరి మధ్య ఇప్పుడు సోషల్ మీడియా వార్ జరుగుతుంది. తాజాగా హరీష్‌కు తోడుగా నిర్మాత పివిపి కూడా రంగంలోకి దిగాడు. బండ్ల గణేష్‌ను బ్లేడ్ బాబు అంటూ సెటైర్లు వేసాడు ఈయన.
పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు @harish2you. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట.వాడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు, నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి
— PVP (@PrasadVPotluri) May 18, 2020
WAITINGG 👍
ప్రస్తుతం పివిపి చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. హరీష్ శంకర్‌ను పొగుడుతూ.. బండ్ల గాలి తీస్తూ ఈయన పోస్ట్ చేసాడు. పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడ గురించి బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వెయింటింగ్. తమ్ముడు స్టార్ట్ యూవర్ కుమ్ముడు అని ట్వీట్ చేసాడు పివిపి.
మీ 'భాష,భావం' రెండూ నన్ను అలరించాయ్. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం.🙏🙏🙏🙏 Thank you for acknowledging my work Sir https://t.co/md0YjnZjqi
— Harish Shankar .S (@harish2you) May 18, 2020
ఈయన ట్వీట్‌కు హరీష్ శంకర్ రిప్లై ఇచ్చాడు. మీ భాష, భావం రెండూ నన్ను అలరించాయ్. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం. నా పనితనాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు సార్ అంటూ రిప్లై ఇచ్చాడు హరీష్. ఏదేమైనా కూడా ఈ ఇద్దరూ బండ్ల గణేష్‌ను టార్గెట్‌గా చేసుకుని చేస్తున్న ట్వీట్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Harish Shankar, PVP, Telugu Cinema, Tollywood