Home /News /movies /

PRODUCER POKURI RAMARAO PASSESED AWAY DUE TO CORONA SR

కరోనాతో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ మృతి... విషాదంలో సినీ పరిశ్రమ..

పోకూరి రామారావు Photo : Twitter

పోకూరి రామారావు Photo : Twitter

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ ప్రొడ్యూసర్ పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు మృతి చెందారు.

    సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ ప్రొడ్యూసర్ పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు మృతి చెందారు. ఈరోజు ఉదయం 9గంటల సమయంలో ఆయనకు గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. పోకూరి రామారావు మణికొండలో గల తన నివాసంలో ఈరోజు ఉదయం గుండెపోటుకు గురవ్వడంతో ప్రాణాలు విడిచారు. పోకూరి రామారావు ఈతరం ఫిల్మ్స్ బ్యానర్‌పై సామాజిక, విప్లవాత్మక కోణంలో చాలా సినిమాలను నిర్మించారు. అందులో ముఖ్యంగా నేటి భారతం, ఎర్ర మందారం, యజ్ఞం, రణం వంటి అనేక హిట్ చిత్రాలు ప్రజల మన్నల్నీ పొందాయి. పోకూరి రామారావు అకాల మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. వారి కుటుంబానికి ధైర్యం, ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. అయితే ఆయన కొద్ది రోజుల కింద కరోనా వ్యాదితో బాధపడుతూ కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ రోజు ఉదయం పరిస్థితి విషమించి కన్నుమూశారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Gopichand, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు