హోమ్ /వార్తలు /సినిమా /

Acharya Pre Release Event:ఆచార్య వేదికపై.. పరోక్షంగా మంచు విష్ణుపై కామెంట్లు

Acharya Pre Release Event:ఆచార్య వేదికపై.. పరోక్షంగా మంచు విష్ణుపై కామెంట్లు

ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ చిరంజీవి

ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ చిరంజీవి

తెలుగు సినిమా ఇండస్ట్రీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ నిర్మాత ఎన్వీ ప్రసాద్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్లు తనముందు వచ్చి మాట్లాడాలని ఆచార్య వేదికపై సవాల్ చేశారు ఆయన.

చిరంజీవి ఆచార్య సినిమా ఈనెల 29న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం ఆచార్య ప్రిరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు,డైరెక్టర్లు, టెక్నీషియన్లు, ఇలా చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆచార్య సినిమా కోసం చిరంజీవి ఎన్నో త్యాగాలు చేశారన్నారు. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి ఓ డేట్ అడిగితే చిరంజీవి వెంటనే ఆయనకు సాయం చేశారన్నారు. ఎవరో ఎన్నెన్నో మాట్లాడుతుంటారు.. కానీ ఇవాళ ఇండస్ట్రీ బతికిందంటే అది చిరంజీవి వల్లే బతికింది అన్నారు ప్రసాద్. ఊరికే బయట మాట్లాడటం సోషల్ మీడియాలో మాట్లాడటం కాదు ఎవరైనా సరే తన ముందు వచ్చి మాట్లాడాలంటూ సవాల్ చేశారు ప్రసాద్. తెలుగు ఇండస్ట్రీ ఇవాళ నెంబర్ వన్ ప్లేసుకు వెళ్లిందన్నారు. దీని వెనుక చిరంజీవి కృషి ఎంతో ఉందన్నారు.

ప్రస్తుతం ప్రసాద్ చిరంజీవి హీరోగా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాను నిర్మిస్తున్నారు. గాడ్ ఫాదర్ పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా. మలయాళంలో హిట్టైన 'లూసిఫర్' సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ రీమేక్‌ చేస్తున్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌లో చిరంజీవి రామ్ చరణ్‌లకు సంబంధించిన మరిన్ని విషయాలు చెబుతామన్నారు ప్రసాద్.

అయితే ఇప్పుడు ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా మంచు విష్ణు ఉన్న సంగతి తెలిసిందే. అయితే మంచు విష్ణు ఆ మధ్య మెగా ఫ్యామిలీపై వ్యాఖ్యలు చేయడం అవి కాస్త ఈ రెండు ఫ్యామిలీల మధ్య .. మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్‌కు మధ్య వివాదాలు రేకెత్తించడం జరిగింది. అయితే ఇదే విషయంలో సోషల్ మీడియాలో మాట్లాడటం కాదంటూ ప్రసాద్.. ఇన్ డైరెక్ట్‌గా మంచు విష్ణును ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారా అని టాలీవుడ్‌లో ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. మరి దీనిపై మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

First published:

Tags: Acharya, Manchu Family, Manchu Vishnu, Mega Family, Megastar Chiranjeevi

ఉత్తమ కథలు