Home /News /movies /

PRODUCER KS RAMARAO COMMENTS ON TOLLYWOOD PRESENT SITUATION SLB

టాలీవుడ్‌ ఆ నలుగురి చేతుల్లోనే ఉంది.. సినీ ఇండ‌స్ట్రీ ప‌రిస్థితులపై సీనియర్ నిర్మాత సెటైర్స్

Photo Twitter

Photo Twitter

K. S. Rama Rao: కొత్త నటీనటులుతో తెరకెక్కనున్న ‘ఐక్యూ’ మూవీ ప్రారంభోత్సవ వేడుకలో నిర్మాత కె.ఎస్‌.రామారావు తీసుకొచ్చిన ప్రస్తావన ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. పరిశ్రమలో ఆరితేరిన నిర్మాతగా కొత్త నిర్మాతలకు పలు సూచనలు ఇస్తూ ఆయన ఓపెన్ అయ్యారు.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం టాలీవుడ్‌ (Tollywood) ఆ నలుగురి చేతుల్లోనే ఉందన్నట్లుగా సీనియర్ నిర్మాత కె.ఎస్‌.రామారావు (KS Rama Rao) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సినీ ఇండ‌స్ట్రీలో తాజా ప‌రిస్థితులపై ఇన్‌డైరెక్ట్‌గా సెట్సైర్ వేస్తూ ఓపెన్ అయ్యారు కె.ఎస్‌.రామారావు. తెలుగు చిత్ర పరిశ్రమను శాసించేది ఆ నలుగురు మాత్రమే అంటూ చాలా సంవత్సరాలుగా అనుకుంటున్న మాటలను రిపీట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఆ నలుగురు ఎవరనేది పెద్దగా బయటకు చెప్పిన వాళ్ళు లేరు.. కానీ నిర్మాత కె.ఎస్‌.రామారావు మాత్రం ఆ నలుగురి పేర్లు కూడా బయటపెట్టడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

కొత్త నటీనటులుతో తెరకెక్కనున్న ‘ఐక్యూ’ మూవీ ప్రారంభోత్సవ వేడుకలో నిర్మాత కె.ఎస్‌.రామారావు తీసుకొచ్చిన ఈ ప్రస్తావన ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. పరిశ్రమలో ఆరితేరిన నిర్మాతగా కొత్త నిర్మాతలకు పలు సూచనలు ఇస్తూ ఆయన ఓపెన్ అయ్యారు. ఓ సినిమా విడుదల కావాలన్నా.. జనం ఆదరణ పొందాలన్నా మొదట ఆ నలుగురిని మెప్పించాలని, అదే జరగకపోతే సినిమాకు మోక్షం లభించదని కె.ఎస్‌.రామారావు చేసిన కామెంట్స్ పలు చర్చలకు తావిచ్చాయి.

ఇంతకీ కె.ఎస్‌.రామారావు చెప్పిన ఆ నలుగురు ఎవరంటే.. దిల్‌ రాజు (Dil Raju), అల్లు అరవింద్‌ (Allu Aravind), సునీల్‌ నారంగ్‌ (Sunil Narang), సురేశ్‌ బాబు (Suresh Babu). వీళ్ళ పేర్లను ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు సదరు సీనియర్ ప్రొడ్యూసర్. ఇండస్ట్రీలో చిన్న సినిమా మనుగడపై మాట్లాడిన కె.ఎస్‌.రామారావు.. ఏదైనా సినిమా తీసిన‌ప్పుడు ప్ర‌జ‌ల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాల్సిన వాళ్లు ఈ నలుగురే అని అన్నారు.

అంతేకాదు ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాధ కలుగుతోందని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు చాలా తీస్తున్నారు కానీ ఆదరణ మాత్రం ఆశించిన రీతిలో కనబడటం లేదని ఆయన పేర్కొన్నారు. కథ ఎంత గొప్పదైనా, ఎంత బడ్జెట్‌ పెట్టి సినిమా తీసినా కూడా ఈ రోజుల్లో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం చాలా ముఖ్యం అయిందని, అందుకే ప్రమోషన్‌ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. అన్నింటికంటే ముందు ఓ సినిమా ప్రజల్ని మెప్పించాలంటే మొదట ఆ నలుగురిని మెప్పించాలని, కాబట్టి ఆ నలుగురు మెచ్చుకునే విధంగా ఈ చిత్రం ఉండాలి.. అలాంటి పరిస్థితుల్లో ఉంది సినిమా ఇండస్ట్రీ అని కె.ఎస్‌.రామారావు చెప్పడం గమనార్హం.

ఆ న‌లుగురు లేదా ఐదుగురు హీరోలతోనే సినిమాలు తీయాల్సి వ‌స్తుందని, ఆ న‌లుగురు డైరెక్ట‌ర్స్ చుట్టూనే సినిమా తిర‌గాల్సి వ‌స్తుంది అని చెప్పిన కె.ఎస్‌.రామారావు.. సినిమాలు తీయ‌టం వ‌ల్ల బ‌డ్జెట్ పెరిగిపోతోందని చెప్పారు. చివరకు ఆ భారమంతా ప్రేక్షకుల మీద పడటం, టికెట్‌ ధరలు పెరగడం జరుగుతోందని.. అందువల్ల ప్రేక్షకులు ఓ పదిరోజుల తర్వాత ఓటీటీలో చూద్దాంలే అనే ఆలోచనకు వస్తున్నారని ఆయన చెప్పారు. ఇదే జరిగితే థియేటర్ల మనుగడ చాలా కష్టం అని కె.ఎస్‌.రామారావు పేర్కొన్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Dil raju, Tollywood, Tollywood Producers

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు