బుట్ట బొమ్మ డాన్స్‌కు ఫిదా అయిన మరో స్టార్ సెలబ్రిటీ కొడుకు..

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అందులోని పాటలు కూడా అదే రేంజ్‌లో సూపర్ హిట్టయ్యాయి. తాజాగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్‌కు ప్రముఖ స్టార్ సెలబ్రిటీ కొడుకు కూడా ఫిదా అయ్యాడు.

news18-telugu
Updated: June 4, 2020, 8:31 AM IST
బుట్ట బొమ్మ డాన్స్‌కు ఫిదా అయిన మరో స్టార్ సెలబ్రిటీ కొడుకు..
బుట్ బొమ్మ సాంగ్‌కు ఫిదా అయిన మరో స్టార్ సెలబ్రిటీ (Twitter/Photo)
  • Share this:
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అందులోని పాటలు కూడా అదే రేంజ్‌లో సూపర్ హిట్టయ్యాయి. ఈ సినిమా సక్సెస్‌‌లో పాటలు  కీ రోల్ పోషించాయనే చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రానికి తమన్ అందించిన బాణీలు సూపర్ హిట్టైయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్‌కు మన దేశంలోని సెలబ్రిటీలతో పాటు విదేశీలు కూడా ఇంప్రెస్ అయ్యారు. ఈ పాటలో అల్లు అర్జున్ స్టెప్పులు అందరినీ అలరించాయి. జానీ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ ఈ సినిమాలోని పాటలకు ప్రాణంలా నిలిచాయి.  ఇప్పటికే అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్‌కు డేవిడ్ వార్నర్ ఫిదా అయి ఆ పాటకు డాన్సులు కూడా చేసాడు. ఆ తర్వాత రాములో రాములో సాంగ్‌కు ఫ్యామిలీతో కలిసి చిందేసిన సంగతి తెలిసిందే కదా. అటు దిశా పటానీ, శిల్పాశెట్టి కూడా బుట్టబొమ్మకు సాంగ్‌కు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే బుట్ట బొమ్మ సాంగ్ యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అల్లు అర్జున్ కెరీర్‌లో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్‌గా నిలిచింది.


View this post on Instagram

Fav song of my fav boy! ) also #gendaphool ! How music has no language!!!


A post shared by Erk❤️rek (@ektarkapoor) on

తాజాగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్‌కు బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ కొడుకు బుట్ట బొమ్మ సాంగ్ చూసి డాన్సులు చేసాడు. ఈ వీడియోను ఏక్తా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ సినిమాను హిందీతో పాటు పలు భాషల్లో రీమేక్ చేయడానికి రంగం సిద్దం అయింది. ఇప్పటికే హిందీలో రణ్‌‌వీర్ సింగ్ నటించే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రణ్‌వీర్ కాకపోతే.. కార్తీక్ ఆర్యన్ పేరు పరిశీలిస్తున్నారు. మొత్తానికి అల వైకుంఠపుమురములో హిందీ వెర్షన్‌లో ఎవరు హీరోగా నటిస్తారనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 4, 2020, 8:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading