దిల్ రాజు కళ్లు తెరిపించిన సమంత.. అందుకే పవన్ కళ్యాణ్‌తో..

తెలుగులో హిట్ సినిమాలతో తన కంటూ ప్రొడ్యూసర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దిల్ రాజు. తాజాగా సమంత..దిల్ రాజు కళ్లు తెరిపించింది. ఇంతకీ సామ్.. దిల్ రాజు కళ్లు తెరిపించడమేమిటి అని ఆశ్యర్యపోతున్నారా.. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: February 6, 2020, 9:19 AM IST
దిల్ రాజు కళ్లు తెరిపించిన సమంత.. అందుకే పవన్ కళ్యాణ్‌తో..
దిల్ రాజు, సమంత, పవన్ కళ్యాణ్ (File/Photos)
  • Share this:
తెలుగులో హిట్ సినిమాలతో తన కంటూ ప్రొడ్యూసర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దిల్ రాజు. ఈ ఇయర్ మహేష్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మరో సూపర్ హిట్‌ను తన అకౌంట్‌లో వేసుకుంటున్నాడు. ఇపుడు సమంత, శర్వానంద్ హీరో, హీరోయిన్లుగా తమిళంలో హిట్టైన 96 సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేసాడు. ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన సమంత..దిల్ రాజు కళ్లు తెరిపించడమేమిటి అని ఆశ్యర్యపోతున్నారా.. వివరాల్లోకి వెళితే.. దిల్ రాజు గత పదిహేనుళ్లుగా అగ్ర నిర్మాతగా తన అప్రతిహత ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. ఇన్నేళ్లు కెరీర్‌లో దిల్ రాజు ఇప్పటి వరకు రీమేక్ సినిమాలు ప్రొడ్యూస్ చేయలేదు. కానీ ఫస్ట్ టైమ్.. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 సినిమాను తెలుగులో సమంత, శర్వానంద్‌లతో ‘జాను’ టైటిల్‌తో రీమేక్ చేసాడు. తమిళంలో 96ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.

సమంత అక్కినేని జాను సినిమా ట్రైలర్ (Jaanu movie)

జానులో సమంత, శర్వానంద్


ఇక పదిహేనేళ్ల కెరీర్‌లో దిల్ రాజు రీమేక్‌ల జోలికి వెళ్లలేదు. గతంలో ‘బెంగళూరు డేస్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు. అంతేకాదు  ఆ రీమేక్ కోసం నాని, శర్వానంద్‌లను ఒప్పించాడు కూడా. కానీ మరో హీరో క్యారెక్టర్ కోసం సరైన నటుడు దొరక్కపోవడంతో అప్పట్లో దిల్ రాజు ఆ రీమేక్ ప్రయత్నాన్ని పక్కన పెట్టాడు. ఆ  తర్వాత మలయాళ  ‘ప్రేమమ్’ చిత్రాన్ని రీమేక్ చేయాలనకున్నా.. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనడంతో అదీ కుదరలేదు. కానీ 96 తెలుగు రీమేక్‌ ‘జాను’ మూవీతో రీమేక్ సినిమా చేయాలన్న దిల్ రాజు కోరిక నెరవేరింది. అంతేకాదు ఈ రీమేక్ కారణంగా హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్‌తో రీమేక్ చేస్తున్నాడు. ఈ రకంగా పవర్ స్టార్‌తో  సినిమా చేయాలనే దిల్ రాజు కోరిక ఈ రీమేక్ చిత్రాల కారణంగానే నెరవేరిందనే చెప్పాలి.

పవన్ కళ్యాణ్,క్రిష్ (Pawan Kalyan Krish)
పవన్ కళ్యాణ్,క్రిష్ (Pawan Kalyan Krish)
అంతేకాదు ఇదే యేడాది హిందీలో ‘జెర్సీ’ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. మొత్తానికి ఈ యేడాది రీమేక్‌ కథల వల్లే తాజాగా పవన్ కళ్యాణ్, ఆపై హిందీలో దిల్ రాజు సినిమా చేయాలన్న రెండు కోరికలు నెరవేరాయి. దానికి సమంత జాను తోడ్పాటు అందించదనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.
First published: February 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు