హోమ్ /వార్తలు /సినిమా /

పింక్ రీమేక్‌పై కోర్టుకెళ్లిన దిల్ రాజు.. పవన్ ఫ్యాన్స్ షాక్..

పింక్ రీమేక్‌పై కోర్టుకెళ్లిన దిల్ రాజు.. పవన్ ఫ్యాన్స్ షాక్..

పవన్ కళ్యాణ్ దిల్ రాజు (Pawan Kalyan Dil Raju)

పవన్ కళ్యాణ్ దిల్ రాజు (Pawan Kalyan Dil Raju)

Dil Raju: అదేంటి.. సొంత సినిమాపై దిల్ రాజు ఎందుకు కోర్టుకు వెళ్తాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది.. జరిగింది కూడా. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కావడంతో అంచనాలు ముందు నుంచి..

అదేంటి.. సొంత సినిమాపై దిల్ రాజు ఎందుకు కోర్టుకు వెళ్తాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది.. జరిగింది కూడా. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కావడంతో అంచనాలు ముందు నుంచి కూడా భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. పైగా అజ్ఞాతవాసి డిజాస్టర్ కావడంతో మళ్లీ వచ్చి హిట్ కొట్టి సత్తా నిరూపించుకోవాలని చూస్తున్నాడు పవర్ స్టార్. ఇప్పుడు ఈయన నటిస్తున్న పింక్ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఫోటోలు, వీడియోలు తీసి లీక్ చేస్తూనే ఉన్నారు. దీనిపైనే ఇప్పుడు దిల్ రాజు కూడా సీరియస్ అయ్యాడు.

పవన్ కళ్యాణ్ దిల్ రాజు (Pawan Kalyan Dil Raju)
పవన్ కళ్యాణ్ దిల్ రాజు (Pawan Kalyan Dil Raju)

తన సినిమా గురించి ఎవరైనా సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్ట్ చేసినా.. ఫోటోలు కానీ వీడియోలు కానీ షేర్ చేసినా కూడా న్యాయపరంగా చర్యలు తప్పవని పిటిషన్‌లో తెలిపాడు దిల్ రాజు. పింక్ సినిమా షూటింగ్ ఫోటోలు, వీడియోలు రోజూ నెట్‌లో దర్శనమిస్తూనే ఉన్నాయి. దీనిపై పవన్ కూడా సీరియస్ అయ్యాడని తెలుస్తుంది. నిర్మాత దిల్ రాజును కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా ఏం చేస్తున్నారంటూ క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో దిల్ రాజు ఇదే విషయంపై ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేసాడు.

పవన్ కళ్యాణ్ దిల్ రాజు (Pawan Kalyan Dil Raju)
పవన్ కళ్యాణ్ దిల్ రాజు (Pawan Kalyan Dil Raju)

తన సినిమా గురించి ఎవరు కూడా ఇలా అడ్డగోలుగా ఫోటోలు వీడియోలు పోస్ట్ చేయకూడదంటూ సీరియస్ అయ్యాడు. అలాంటి వాళ్లకు ఏడాది వరకు జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా కూడా విధిస్తామని చెప్పాడు ఈయన. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌తోనే బిజీగా ఉన్నాడు. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా కన్ఫర్మ్ చేసాడు పవర్ స్టార్. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్‌తో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తున్నారు. మే 15న సినిమా విడుదల కానుంది. దీనికి వకీల్ సాబ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

First published:

Tags: Dil raju, Pawan kalyan, Pink, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు