మహేష్..‘మహర్షి’ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు ..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. హీరోగా మహేశ్‌కు ఇది 25వ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ‘ఎఫ్ 2’ భారీ విజయం సాధించడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘మహర్షి’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 23, 2019, 7:49 AM IST
మహేష్..‘మహర్షి’ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
మహర్షి సినిమాలో మహేశ్ బాబు (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు ..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. హీరోగా మహేశ్‌కు ఇది 25వ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ..త్రీ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు.

దిల్ రాజు, సి.అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. మరోవైపు అల్లరి నరేష్..ఈ సినిమాలో మహేష్ ఫ్రెండ్ పాత్రలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ మంచి రేటుకే అమ్ముడుపోయింది.

తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ‘ఎఫ్ 2’ భారీ విజయం సాధించడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘మహర్షి’ సినిమా గురించి మీడియా కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికి దిల్ రాజు సమాధానిమిస్తూ..త్వరలో అబుదాబిలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించే అవకాశం ఉంది. మరోవైపు ఈ సినిమాను ఏప్రిల్ 5నే కాకుండా ఏప్రిల్ 25వ తేదినే విడుదల చేయనున్నట్టు దిల్ రాజు చెప్పారు. మొత్తానికి దిల్‌రాజు ప్రకటనతో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఉన్న అనుమానాలు తొలిగాయి.

ఇవి కూడా చదవండి

ప్రభాస్‌ను బీట్ చేసిన కేజీఎఫ్ స్టార్ యశ్

జాన్వీక‌పూర్ డాన్స్ చూసారా.. అచ్చం శ్రీ‌దేవి గుర్తుకొస్తుంది..

తెలుగుదేశంపై సెటైర్లు వేసిన నాగ‌బాబు.. నారా లోకేష్ తొలి ల‌క్ష్యం..
First published: January 23, 2019, 7:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading