బాలకృష్ణ భారీ పారితోషికంపై... ‘రూలర్’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

బాలయ్య కొత్త సినిమాకు... ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ను డబుల్ చేశారన్న ప్రచారం జోరుగా జరిగింది.

news18-telugu
Updated: October 31, 2019, 11:44 AM IST
బాలకృష్ణ భారీ పారితోషికంపై... ‘రూలర్’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
పవర్ ఫుల్ టైటిల్‌తో వస్తోన్న బాలకృష్ణ (Twitter/Photo)
  • Share this:
గత కొన్ని రోజులుగా నందమూరి బాలకృష్ణ పారితోషికం... అమాంతం పెంచేశారని వార్తలు వినిపిస్తున్నాయి. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న బాలయ్య కొత్త సినిమాకు... ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ను డబుల్ చేశారన్న ప్రచారం జోరుగా జరిగింది. నిర్మాత కూడా దీనికి ఓకే చెప్పారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిపై స్పందించారు నిర్మాత సి. కల్యాణ్. బాలయ్య ఎప్పుడూ కూడా రెమ్యునరేసన్ గురించి ఆలోచించరన్నారు. తన సినిమా కోసం ఆయన భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేశారనడంలో నిజం లేదని తేల్చేశారు. మా మధ్య పారితోషికంకు సంబంధించిన చర్చలే జరగలేదన్నారు.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో డిఫరెంట్ లుక్స్ తో బాలకృష్ణ కనిపించనున్నారు. ‘రూలర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

First published: October 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>