అవకాశం ఇస్తానని బన్నివాసు మోసం చేశాడు.. గీతా ఆర్ట్స్ దగ్గర మహిళ హల్ చల్...

Producer Bunny Vasu Photo : Instagram

Producer Bunny Vasu : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నివాసు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర హల్ చల్ చేసింది ఓ మహి

 • Share this:
  టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నివాసు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర హల్ చల్ చేసింది ఓ మహిళ.. వివరాల్లోకి వెళితే.. సినీ నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని, అడిగితే బెదిరిస్తున్నాడని ఆత్మహత్యకు పాల్పడుతానంటూ జూబ్లీహిల్స్‌ లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయం వద్ద సునీత బోయ అనే మహిళ ఆరోపించింది. అందులో భాగంగా గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ముందుకు వచ్చిన సునీత ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని పేర్కోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ముందుకు వచ్చిన సునీత బోయను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మలక్‌పేట ప్రాంతంలో కొంత కాలంగా పుచ్చకాయలు విక్రయిస్తున్న సునీత బోయకు గతంలో సినీ పరిశ్రమతో కొంత సంబంధాలు ఉండేవి.

  ఆమె కొన్ని సినిమాల్లో కూడా జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసిందట. అది అలా ఉంటే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనకు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పి.. అవకాశాలు ఇవ్వకుండా మోసం చేశాడని ఆమె ఆరోపిస్తున్నారు.

  ఈ నేపథ్యంలోనే బన్నీ వాసు ఇప్పటికే నాలుగుసార్లు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమె ఇప్పటికే రెండు సార్లు జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు తాజాగా మరోసారి సునీత గీతా ఆఫీస్ దగ్గర హల్ చల్ చేయడంతో ఆఫీస్ మేనేజర్ ఫిర్యాదు మేరకు ఆమెను పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, మానసిక ఆస్పతికి తరలించాలనీ జూబ్లీహిల్స్‌ పోలీసులు న్యాయమూర్తిని కోరారు. గతంలో కూడా రెండుసార్లు మానసిక సమస్యలతో సునీత ఎర్రగడ్డలోని ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలుస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published: