PRODUCER BONEY KAPOOR UPSET WITH RAJAMOULI DECISION ON RRR MOVIE RELEASE DATE MNJ
Rajamouli: రాజమౌళి నిర్ణయంతో పవన్ నిర్మాత అప్సెట్.. దర్శకధీరుడికి ఫోన్ చేసి
Ajay Devagan takes Bahubali director ss rajamouli suggestions on Mayday movie making full details here
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అప్డేట్ని దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)సోమవారం ఇచ్చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan)లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ అన్ని భాషల్లో రాబోతున్నట్లు దర్శకధీరుడు అధికారికంగా తెలిపారు
Rajamouli: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అప్డేట్ని దర్శకధీరుడు రాజమౌళి సోమవారం ఇచ్చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ అన్ని భాషల్లో రాబోతున్నట్లు దర్శకధీరుడు అధికారికంగా తెలిపారు. దీంతో ఇప్పటినుంచే ఆ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానుల్లో ఎదురుచూపులు మొదలయ్యాయి. అయితే రాజమౌళి టీమ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రముఖ నిర్మాత బోని కపూర్ అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో రాజమౌళికి కాల్ చేసి.. ఇది సరైనది కాదని అన్నట్లు ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది.
అయితే అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్లో అజయ్ దేవగన్, ప్రియమణి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం మైదాన్. ఈ మూవీని బోని కపూర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 15న రిలీజ్ అవ్వబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు అదే సమయానికి ఆర్ఆర్ఆర్ వస్తే ఆ ఎఫెక్ట్ మైదాన్‌పై పడే అవకాశం ఉంది. దానికి తోడు బాహుబలితో రాజమౌళి క్రేజ్ పెరిగిపోవడంతో.. ఆర్ఆర్ఆర్పై బాలీవుడ్‌లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై బోని కపూర్ అప్సెట్ అయినట్లు సమాచారం. కాగా ఈ రెండు చిత్రాల్లో అజయ్ దేవగన్ నటిస్తుండగా.. ఆయన అభిమానులకు ఈ దసరా డబుల్ బొనాంజాగా ఉండనుంది.
కాగా రాజమౌళి, బోని కపూర్ ఫ్యామిలీ మధ్య గతంలోనూ ఒక చిన్న వివాదం జరిగింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిలో శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించామని.. ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ అడగడంతో ఆ తరువాత రమ్యకృష్ణను సంప్రదించామని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలను శ్రీదేవి ఖండించారు. తన ఇంట్లో కూడా నిర్మాత ఉన్నాడని.. అసలు రాజమౌళి అలా ఎందుకు అన్నారో తెలీదని ఆమె అన్నారు. అంతేకాదు తనకు రాజమౌళి అంటే ఇష్టమని.. ఆయన తెరకెక్కించిన మగధీర, ఈగ చిత్రాలు తనకు ఇష్టమని శ్రీదేవి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.