Boney Kapoor: నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన బడా ప్రొడ్యూసర్ బోని కపూర్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. తన కూతురికి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్ని రోజులు తనలో దాగి ఉన్న మరో టాలెంట్‌ను బయటపెట్టబోతున్నారు. అసలు ఏంటి..? ఆయన ఏం చేయబోతున్నారు..? అనుకుంటున్నారా..? బోని కపూర్ నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అవును మీరు చదువుతున్నది నిజమే.. దివంగత శ్రీదేవి భర్త ఇప్పుడు నటుడిగా ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా లవ్ రంజన్ ఓ రొమాంటిక్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో రణ్‌బీర్ సరసన తొలిసారిగా శ్రద్ధా కపూర్ జతకట్టబోతోంది. ఇక ఇందులో రణ్‌బీర్ తల్లిగా డింపుల్ కపాడియా నటిస్తుండగా.. అతడి తండ్రి పాత్రలో బోని కపూర్ కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది. కాగా ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన AK Vs AK చిత్రంలో బోని అతిథి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.
ఇక ఇదంతా చూస్తుంటే బోని కపూర్ నటనలో తన కుమార్తె జాన్వీ కపూర్‌కి పోటీ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతోంది. కాగా దఢక్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ఆ తరువాత గుంజన్ సక్సేనాః ద కార్గిల్ గర్ల్ మూవీతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు చిత్రాల్లో జాన్వీ నటిస్తోంది. మరోవైపు బోని కపూర్ చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా త్వరలో వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.