తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వేళ్ల మీద లెక్కపెట్టే నిర్మాణ సంస్థల్లో వైజయంతి మూవీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంస్థ అధినేత అశ్వనీదత్ తెలుగు ఇండస్ట్రీలో మూడు తరాలకు చెందిన అగ్ర హీరోలతో సినిమాలు తీసి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈ బ్యానర్ యాభై ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ప్రతి తరంలో గుర్తుండి పోయే చిత్రాలు వచ్చాయి. మధ్యలో కొన్ని ఫ్లాపు సినిమాలు వచ్చినా.. మహానటి సినిమాతో వైయజంతీ మూవీస్ పూర్వ వైభవం అందుకుంది. అంతేకాదు గతేడాది ‘మహర్షి’ సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్లో ప్రభాస్‌తో అత్యంత భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా లెవల్లో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా రాబోతుంది. వచ్చే యేడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు నిర్మాత అశ్వనీదత్ తెలియజేసారు.
మరోవైపు ఈ సంస్థ నుంచి వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ’ఈ నెల 9తో 30 ఏళ్లు కంప్లీట్ చేసుకోబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్గా నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాకు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న అన్నిరికార్డులను తిరగ రాసింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ కథను రెడీ చేయిస్తున్నట్టు అశ్వనీదత్ తెలిపారు. అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్ తీసి చిత్ర పరిశ్రమ నుంచి గౌరవంగా రిటైర్మైంట్ ప్రకటిస్తానని చెప్పాడు.
కానీ ఈ సీక్వెల్‌ను ఎవరి దర్శకత్వంలో ఎవరిని హీరోగా పెట్టి తెరకెక్కించే విషయాన్ని మాత్రం అశ్వనీదత్ దాటవేసారు. ఆయన చెప్పకపోయినా.. జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ గురించి గత కొన్నేళ్లుగా మాట ముచ్చట వినిపిస్తూనే ఉంది. ఒకవేళ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తే.. అందులో రామ్ చరణ్ హీరో అయితేనే ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. మరోవైపు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సీక్వెల్లో యాక్ట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ జనరేషన్లో జగదేకవీరుడు అతిలోకసుందరిగా ఎవరు అలరిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aswani Dutt, Chiranjeevi, K. Raghavendra Rao, Ram Charan, Sridevi, Tollywood, Vyjayanthi Movies