రజినీకాంత్ గారూ డబ్బులివ్వండి.. దర్బార్ బయ్యర్ల విన్నపం..

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ టైమ్ ఈ మధ్య అస్సలు బాగోలేదు. ఈయన సినిమాలన్నీ వరసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఈయన నటించిన దర్బార్ సినిమా సంక్రాంతికి విడుదలైంది. ఇది కూడా భారీ నష్టాలే తీసుకొచ్చింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 31, 2020, 2:41 PM IST
రజినీకాంత్ గారూ డబ్బులివ్వండి.. దర్బార్ బయ్యర్ల విన్నపం..
ఏడాది మొదట్లో రజినీకాంత్ హీరోగా వచ్చిన దర్బార్‌లో ఆయన కూతురుగా నటించింది నివేదా థామస్. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కూడా కీలక పాత్రలోనే కనిపించబోతుంది.
  • Share this:
సూపర్ స్టార్ రజినీకాంత్ టైమ్ ఈ మధ్య అస్సలు బాగోలేదు. ఈయన సినిమాలన్నీ వరసగా ఫ్లాప్ అవుతున్నాయి. కొన్ని సినిమాలతో బయ్యర్లు పూర్తిగా రోడ్డు మీదకు వచ్చేసారు కూడా. ఆ మధ్య లింగా, కాలా లాంటి సినిమాలు డిస్ట్రిబ్యూటర్లను దారుణంగా ముంచేసాయి. ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. ఈయన నటించిన దర్బార్ సినిమా సంక్రాంతికి విడుదలైంది. రజినీ సినిమా అనగానే ముందు వెనక చూడకుండా భారీగా కొనేస్తారు బయ్యర్లు. దాంతో ప్రతీసారి నష్టాలు తెచ్చుకుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. దర్బార్ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.

దర్బార్ సినిమా (Darbar movie Rajinikanth)
దర్బార్ సినిమా (Darbar movie Rajinikanth)


అయితే ఆయన ఇమేజ్‌తో సినిమా కచ్చితంగా ఆడుతుందనుకున్నారు కానీ మ్యాజిక్ రిపీట్ కాలేదు. మురుగదాస్ ఉన్నా కూడా దర్బార్ సినిమా ఫ్లాప్ లిస్టులోకే వెళ్లింది. ఈ చిత్రంతో తమిళనాట కొందరు బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. దాంతో వాళ్లంతా కలిసి నిర్మాతను కలిసారు.. ఇప్పుడు నిర్మాతతో పాటు బయ్యర్లు కూడా కలిసి రజినీకాంత్‌ను కలవబోతున్నారు. తమ నష్టాలకు ఏదో ఓ మార్గం చూపించాలని.. లేదంటే తాము రోడ్డున పడాల్సి వస్తుందని వాళ్లు సూపర్ స్టార్‌కు విన్నవించుకోనున్నారు. రజినీ కూడా దీనికి సానుకూలంగానే స్పందిస్తున్నట్లు తెలుస్తుంది. నష్టాల్లో దాదాపు 50 శాతం తిరిగివ్వడానికి రజినీ ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

దర్బార్ సినిమా (Darbar movie Rajinikanth)
దర్బార్ సినిమా (Darbar movie Rajinikanth)


ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగానే బిజినెస్ చేసిన దర్బార్.. కనీసం 100 కోట్లు షేర్ కూడా తీసుకురాలేదు. కేవలం తమిళనాడులోనే 64 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఇప్పటి వరకు వచ్చింది 37 కోట్లు మాత్రమే. దాంతో ఎటు చూసుకున్నా కూడా దర్బార్ సినిమా భారీగానే నష్టాలు తీసుకొచ్చింది. దాంతో అంతా కలిసి రజినీకాంత్‌నే ఆదుకొమ్మని అడుగుతున్నారు. గతంలో కూడా కొన్ని సినిమాలకు నష్టపోయిన బయ్యర్లను ఆదుకున్నాడు రజినీకాంత్. బాబా సినిమాకు మొత్తం డబ్బులు కూడా తిరిగిచ్చేసాడు. లింగా సమయంలో కూడా తోచిన సాయం చేసాడు సూపర్ స్టార్. ఇప్పుడు కూడా ఇదే చేస్తాడని నమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్లు.
Published by: Praveen Kumar Vadla
First published: January 31, 2020, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading