Home /News /movies /

PRODUCER ALLU BOBBY COMMENTS ON ALLU ARJUN FLOP MOVIE NAA PER U SURYA SB

Allu Arjun: ఆ సినిమా ప్లాప్‌ను బన్నీ తట్టుకోలేకపోయాడు.. రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు

అల్లు బాబి

అల్లు బాబి

    అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ. ఇతను గురించి చాలా మందికి తెలియదు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు ముగ్గురు కుమారులు. అందులో అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇద్దరు హీరోలుగా మారారు. అయితే పెద్ద కుమారుడు అల్లు బాబీ మాత్రం నిర్మాతగా మారాడు. అయితే బాబీ తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సందర్భంగా వరుసగా పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్య్వూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా బన్నీ గురించి మాట్లాడుతూ.. అతనికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

    ప్రస్తుతం పుష్ప హిట్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు బన్నీ. అయితే గతంలో ఓ సినిమా ప్లాప్ అయ్యిందని బన్నీ దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడని చెప్పాడు బాబీ. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత అతనిలో ఎంతో పరిణితి మార్పు వచ్చాయన్నారు. నా పేరు సూర్య సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఆ సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది. దీంతో బన్నీ కుంగిపోయాడన్నారు. సుమారు రెండేళ్లు గ్యాప్‌ తీసుకున్నాడు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు? ఎలాంటి కథలు ఓకే చేయాలి?.. ఇలా తనని తాను పునఃపరిశీలన చేసుకున్నాడని తెలిపారు.

    ఆ తర్వాత వచ్చిన చిత్రమే ‘అల.. వైకుంఠపురములో..’’ అని బాబీ వివరించారు. కెరీర్‌లో విజయాలు అందుకునేందుకు, ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించేందుకు బన్నీ ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నాడని చెప్పారు. పుష్ప కూడా హిట్ అయ్యిందని.. ఇప్పుడు పుష్ప రాజ్ 2లో బన్నీ త్వరలో చేస్తాడని కూడా బాబీ తెలిపారు. ఇక నా పేరు సూర్య సినిమాకు వస్తే.. ఈ చిత్రం 2018లో విడుదలైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జంటగా అను ఇమెన్యూయల్ నటించింది. రావు రమేష్, అర్జున్, ప్రదీప్ రావత్‌కూడా కీలక పాత్రల్లో నటించారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా బన్నీ కెరియర్‌‌లో బిగ్ ప్లాప్ అని చెప్పొచ్చు.ఈ సినిమాకు నిర్మాతలుగా నాగబాబు,బన్నీ వాసు,లగడపాటి శ్రీధర్ ఉన్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Allu aravind, Allu Arjun, Allu Venkatesh (Bobby), Tollywood news

    తదుపరి వార్తలు