గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా ఈమధ్య ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటూనే ఉంది. గతేడాది డిసెంబర్లో నిక్ జోనస్‌ను పెళ్లాడిన ప్రియాంక.. అప్పటి నుంచి హాలీడే ట్రిప్పులు వేస్తూనే ఉంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోన్న ప్రియాంక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసి అభిమానులను పిచ్చెక్కిస్తోంది. తాజాగా ప్రియాంక జన్మదిన వేడుకల్లో బోటులో కూర్చుని జోనాస్ కుటుంబ సభ్యులతో కలిసి గుప్పుగుప్పుమని పొగపీలుస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న తీరుపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. కొద్దిరోజుల క్రితం పొగత్రాగరాదు అంటూ పెద్ద లెక్చర్లు దంచింది ప్రియాంక , ఆస్తమాపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కిందటేడాది ప్రియాంక నడుం బిగించింది. ఆస్తమాపై ప్రజల్లో ఉన్న భయాలను పోగొట్టడానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ప్రచారం చేసింది. దీనిలో భాగంగా తనకు 5 ఏళ్ల వయసులోనే ఆస్తమా వచ్చిందని ప్రియాంక చెప్పింది. అయినప్పటికీ, తాను వెనకడుగు వేయకుండా ఈ స్థాయికి ఎదిగానంటూ స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పింది.ఆ మాటలను ఇప్పుడు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ప్రియాంక అబద్ధాలకోరు అంటూ తిట్టిపోస్తున్నారు.

ప్రియాంక చోప్రా (ట్విట్టర్ ఫోటో)
ప్రియాంక స్మోక్ చేస్తే తప్పు లేనప్పుడు మిగతా వారిని స్మోక్ చేయకండి అని ఎందుకు చెప్పడం? బాణాసంచా కాల్చి కాలుష్యానికి కారణం అవ్వకండి.. దీపావళిని ఇలా సెలెబ్రేట్ చేసుకోకండి అని అందరికీ క్లాసులు పీకి తన పెళ్లికి మాత్రం వీలైనంత కాలుష్యాన్ని జనాలపైకి వదిలింది. ఇప్పుడేమో సభ్యసమాజానికి బికినీ సందేశం.. వైన్ సందేశం కూడా ఇస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఈ సెలబ్రేషన్స్ పూర్తవుతాయి.. అప్పుడు వచ్చి హోలీకి రంగులు పూసుకోవద్దని.. గణేష్ పండగను బొమ్మలు లేకుండా జరుపుకోవాలని ఏది తోస్తే అది చెప్తుంది.అందుకే మన పెద్దలు ఎప్పుడో చెప్పారు 'చెప్పేవాడికి వినేవాడు లోకువ'అంటూ ప్రియాంక తీరును ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.
Published by:Kiran Kumar Thanjavur
First published:July 24, 2019, 20:32 IST