ప్రియాంక చోప్రా మైనపు బొమ్మను చూతము రారండి..

Priyanka Chopra Madame Tussauds Wax Statue | ఇప్పటికే బాలీవుడ్ భామ అనుష్క శర్మ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్‌లో ఉంచారు. అది మరిచిపోక ముందే మరో బీటౌన్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణే మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరనుంది. తాజాగా మైనపు విగ్రహంగా మారిన హీరోయిన్ లిస్ట్‌లో ప్రియాంక చోప్రా కూడా చేరింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 8, 2019, 5:08 PM IST
ప్రియాంక చోప్రా మైనపు బొమ్మను చూతము రారండి..
ప్రియాంక చోప్రా మైనపు విగ్రహం
  • Share this:
ఇప్పటికే బాలీవుడ్ భామ అనుష్క శర్మ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్‌లో  ఉంచారు. అది మరిచిపోక ముందే మరో బీటౌన్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణే మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరనుంది.

తాజాగా మైనపు విగ్రహంగా మారిన హీరోయిన్ లిస్ట్‌లో ప్రియాంక చోప్రా కూడా చేరింది. అంతేకాదు అందరి హీరోయిన్స్ మైనపు ఏదో ఒక చోట కొలువైతే..ప్రియాంక చోప్రా మైనపు విగ్రహాన్ని న్యూయార్క్, లండన్, సిడ్నీ, మరియు ఆసియాలోని సింగరపూర్‌లో కొలువు తీరనుంది.

తాజాగా ప్రియాంక చోప్రా మొదటి మైనపు విగ్రహాన్ని న్యూయార్క్‌లో ఏర్పాటు చేసారు. ఇక్కడ మైనపు విగ్రహంతో ప్రియాంక తీసుకున్న ఫోటో చూస్తుంటే ..అందులో ఏది మైనపు బొమ్మో చెప్పడం కొంచెం కష్టమే అన్నట్టు ఉంది. ఈ బొమ్మను ప్రియాంక చోప్రా ఆవిష్కరించి ఒకింత ఆశ్యర్యాన్ని వ్యక్తం చేసింది.






కానీ ఇక్కడ ప్రియాంక రెడ్ డ్రెస్‌లో మైనపు బొమ్మగా కొలువుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘ది స్కై ఈజ్ బ్లూ’ సినిమాలో యాక్ట్ చేస్తోంది.





 ఇవి కూడా చదవండి


First published: February 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>