బెడ్రూమ్‌లో భర్త నిక్ జోనస్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప్రియాంక చోప్రా..

భార్యాభర్తలు అన్న తర్వాత బోలెడు ఇచ్చుకుంటారు అందులో వింతేముంది అనుకుంటున్నారా..? ముద్దుముచ్చట్లు అయితే ఆలుమగలు బోలెడు ఇచ్చుకుంటారు వాటిని గిఫ్టులు అనాల్సిన అవసరం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 1, 2019, 10:25 PM IST
బెడ్రూమ్‌లో భర్త నిక్ జోనస్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప్రియాంక చోప్రా..
ప్రియాంక, నిక్ Instagram/priyankachopra
  • Share this:
భార్యాభర్తలు అన్న తర్వాత బోలెడు ఇచ్చుకుంటారు అందులో వింతేముంది అనుకుంటున్నారా..? ముద్దుముచ్చట్లు అయితే ఆలుమగలు బోలెడు ఇచ్చుకుంటారు వాటిని గిఫ్టులు అనాల్సిన అవసరం లేదు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం ఇప్పుడు నిజంగానే బెడ్రూమ్‌లో భర్తకు అదిరిపోయే బహుమతి ఇచ్చింది. సర్‌ప్రైజ్ బాగానే ప్లాన్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. భర్త నిక్ జోనస్ బెడ్‌పై పడుకుని ఉండగా ప్రియాంక చోప్రా అతన్ని నిద్ర లేపి మరీ తన బహుమతిని ప్రజెంట్ చేసింది. అది చూసి ఆయన కూడా ముందు షాక్ అయ్యాడు.. ఆ తర్వాత హ్యాపీ అయ్యాడు.ఇంతకీ ప్రియాంక ఇచ్చిన ఆ స్వీట్ గిఫ్ట్ ఏంటో తెలుసా.. కుక్కపిల్ల. అవును.. ఓ ముద్దొచ్చే పప్పీని తన మొగుడికి బహుమతిగా ఇచ్చింది పిగ్గీ చోప్స్. అది చూసి నిక్ కూడా చాలా సంతోషపడ్డాడు. అబ్బా భలే ఉందిగా పప్పీ అంటూ దాంతోనే ముద్దుముచ్చట్లు ఆడేసుకున్నాడు ఈ సింగర్ కమ్ యాక్టర్. ప్రియాంక నిక్ జంట ఇప్పుడు వరల్డ్‌లోనే మోస్ట్ ఫేమస్ సెలెబ్రిటీ కపుల్ అయిపోయారు. దాంతో వాళ్లేం చేసినా కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఇది కూడా ఓ భాగమే. బెడ్రూమ్ గిఫ్ట్ అందుకున్న తర్వాత మరి ప్రియాంకకు రిటర్న్ గిఫ్ట్ ఏమిస్తాడో చూడాలిక.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>