HOME »NEWS »MOVIE »priyanka chopra strong warning to her husband nick jonas and shouted get out my car pk

Priyanka Chopra Nick Jonas: నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా గొడవ.. గెటౌట్ ఆఫ్ మై కార్ అంటూ వార్నింగ్..

Priyanka Chopra Nick Jonas: నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా గొడవ.. గెటౌట్ ఆఫ్ మై కార్ అంటూ వార్నింగ్..
ప్రియాంక చోప్రా నిక్ జోనస్ (priyanka chopra nick jonas)

Priyanka Chopra Nick Jonas: వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. భర్తను పట్టుకుని పో బయటకి అంటూ వార్నింగ్ ఇచ్చింది ప్రియాంక చోప్రా. 2018లో హాలీవుడ్ పాప్ సింగర్ కమ్ యాక్టర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది..

  • Share this:
వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. భర్తను పట్టుకుని పో బయటకి అంటూ వార్నింగ్ ఇచ్చింది ప్రియాంక చోప్రా. 2018లో హాలీవుడ్ పాప్ సింగర్ కమ్ యాక్టర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక. అతడు ఆమె కంటే పదేళ్లు చిన్నవాడు. అయినా కూడా ప్రేమకు వయసుతో పనిలేదని ఈ ఇద్దరూ నిరూపించారు. అయితే ఇప్పుడు తన కారులోంచి గెట్ అవుట్ అంటూ నిక్ జోనస్‌కు వార్నింగ్ ఇచ్చింది ఈ బ్యూటీ. దానికి కారణం కూడా లేకపోలేదు.. అలాగే దీని వెనక చిన్న కథ కూడా ఉంది. ఈ ఇద్దరూ కలిసి ప్రస్తుతం హాలీవుడ్‌లో నటిస్తున్నారు. ఎగ్జైటెడ్ మచ్ అనే సినిమా కోసం ఇద్దరూ డేట్స్ కూడా ఇచ్చారు. అయితే ఆ లోపే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు ప్రియాంక, నిక్ జోడీ. టెక్ట్స్ ఫర్ యూ సినిమాలో ప్రస్తుతం నటిస్తుంది ప్రియాంక చోప్రా. ఇందులో నిక్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఓ సీన్ ఈ మధ్యే లండన్‌లో చిత్రీకరించారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగానే ఇద్దరూ కార్‌లో ఉండే సన్నివేశం అది. ప్రియాంక, నిక్ దెబ్బలాడుకుని ఒకరిపై ఒకరు అరుచుకునే సన్నివేశం అది.
priyanka chopra,nick jonas,priyanka chopra and nick jonas,priyanka chopra nick jonas,nick jonas priyanka chopra,text for you priyanka chopra,priyanka chopra in text for you,priyanka chopra film text for you,priyanka chopra look in text for you,nick jonas and priyanka chopra,priyanka chopra vs nick jonas,priyanka chopra nick jonas fight,ప్రియాంక చోప్రా,ప్రియాంక చోప్రా నిక్ జోనస్,ప్రియాంక చోప్రా నిక్ జోనస్ గొడవ
ప్రియాంక చోప్రా నిక్ జోనస్ (priyanka chopra nick jonas)

ఆ పాత్రలో నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయి ప్రియాంక చోప్రా నటించింది అంటున్నారు మేకర్స్. ఎంతో కోపంగా తన భర్త నిక్ వైపు చూస్తూ గెట్ ది .... ఔట్ ఆఫ్ మై క్యాబ్ అంటూ అరిచేసిందని.. అది చూసి అక్కడున్న వాళ్లు కూడా అంతా షాక్ అయిపోయారని చెప్పుకొచ్చారు దర్శక నిర్మాతలు. అంత బాగా ఈ సీన్‌లో ఇన్వాల్వ్ అయిపోయారని.. అలా చెప్పగానే నిక్ కూడా మౌనంగా కార్ దిగి వెళ్లిపోయాడని.. నిజంగానే వాళ్లిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినంత సీన్ అక్కడ క్రియేట్ చేసారని వాళ్లు చెప్పారు. ఎస్ఎంఎస్ ఫర్ డిచ్ అనే జర్మన్ సినిమా రీమేక్‌గా టెక్ట్స్ ఫర్ యూ తెరకెక్కుతుంది. ఇందులో స్యామ్ హూగమ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఏదేమైనా కూడా ప్రియాంక, నిక్ మధ్య గొడవ సీన్ మాత్రం సినిమాకు హైలైట్ అవుతుందని చెప్తున్నారు దర్శక నిర్మాతలు.

Published by:Praveen Kumar Vadla
First published:December 14, 2020, 12:09 IST

टॉप स्टोरीज