బాలివుడ్ భామ, హాలివుడ్ కోడలు ప్రియాంక చోప్రా నీతులు చెప్పడం వరకే కానీ తాను పాటించడానికి కాదని నిరూపించింది. దీపావళిని దీపాలతో జరుపుకోవాలి కానీ.. పటాసులు కాల్చి కాలుష్యానికి కారణం కావద్దని నీతులు చెప్పిన ఈ బాలీవుడ్ భామ, పబ్లిగ్గా సిగరెట్ తాగి కలకలం సృష్టించింది. ప్రియాంక సిగరెట్ తాగుతున్న చిత్రాలు సోషల్ మీడియాకు ఎక్కడంతో రచ్చమొదలైంది. దీంతో ప్రియాంక చోప్రాను నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. దీపావళి పండగ రోజు కాలుష్యం గురించి లెక్చర్లిచ్చిన భామకు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి మరిచిపోయిందని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే జులై 18న ప్రియాంక.. భర్త నిక్ జోనస్‌తో కలిసి పుట్టిన రోజు సంబరాలను ఘనంగా జరుపుకున్నది. ఈ సందర్భంగా అమెరికాలోని మయామి ప్రాంతంలోని ఒక ప్రైవేటు బోటులో ప్రియాంక దంపతులు సేద తీరుతున్న ఫోటో పోస్ట్ చేసింది. ఇందులో ప్రియాంక చోప్రా భర్తతో కలిసి సిగరేట్‌ను ఆస్వాదిస్తుంది.
అయితే బుద్ధి చెప్పాల్సిన ప్రియాంక తల్లి మధు చోప్రా పెద్ద సిగార్ ముట్టించి ఫోజిచ్చారు. ఇంకేముంది ఈ ఫొటోను చూసిన నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. అంతే కాకుండా ఆస్తమ రోగులను ఉద్దేశించి ప్రియాంక చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేస్తున్నారు. ఐదేళ్లప్పుడు తాను ఆస్తమాతో బాధపడ్డానని, ఆ వ్యాధిని తాను జయించినట్లు ఆమె వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రియాంక చేసిన పనితో ఆస్తమా రోగులు ఈ ఫొటో చూడొద్దంటూ నెటిజన్లు సెటైర్లేస్తున్నారు.
Published by:Krishna Adithya
First published:July 21, 2019, 20:27 IST