Priyanka Chopra Jonas : భారతీయ అందం ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను సంవత్సరం పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి తర్వాత అమ్మడు పాపులారిటీ మరింత పెరిగింది. దీనికి తోడు ప్రియాంక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఆమె భర్త నిక్ కూడా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో తన ప్రాజెక్ట్స్ గురించి ప్రస్థావిస్తూ.. పోస్ట్‌లు చేస్తుంటాడు. ఈ ఇద్దరూ ఏ చిన్న పోస్ట్ చేసినా లేదా ఫోటో పెట్టినా.. క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. ప్రియాంక ఎక్కడ పార్టీలకు వెళ్లినా, బీచ్‌లకు వెళ్లినా, విహార యాత్రలకు వెళ్లినా.. అక్కడ దిగిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటోంది. అది అలా ఉంటే తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియాలో మరో ఫోటో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో కూడా ట్రెండ్ అవుతోంది. ప్రియాంక తన 18వ యేటా 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరిటాన్ని గెలుచుకుంది. అదే విషయాన్ని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. నా 18వ సంవత్సరంలో నేను మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నానని.. ఆ టైటిల్ గెలిచి ఇప్పటికి 20 సంవత్సరాలైంది. అయినా అది నిన్ననే జరిగినట్లు ఉందని రాసుకుంది. ఆమె తన పోస్ట్‌లో ఇంకా రాస్తూ.. అమ్మాయిలకు సరైన అవకాశాలు కల్పిస్తే.. ఖచ్చితంగా వారు సమాజంలో మార్పును తీసుకొస్తారని తెలిపింది.

Instagram/Priyanka Chopra
ప్రస్తుతం ప్రియాంక చోప్రా.. రచయిత అరవింద్ అడిగ రాసిన సటైరికల్ నవల 'వైట్ టైగర్' ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. దీన్ని నెట్‌ప్లెక్స్ సంస్ధ నిర్మిస్తోంది. దీంతో పలు హాలీవుడ్ షోలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రియాంక తాజా హిందీ చిత్రం 'ది స్కై ఈజ్ పింక్, సోనాలీ బోస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓ వ్యక్తి రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనల నేపథ్యంగా తెరకెక్కింది. 'ది స్కై ఈజ్ పింక్', అక్టోబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
Published by:Suresh Rachamalla
First published:February 14, 2020, 15:18 IST