• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRIYANKA CHOPRA SENSATIONAL COMMENTS ON HER HUSBAND NICK JONAS SR

నా భర్త గ్యాస్ సిలిండర్స్ మోశాడు : ప్రియాంక చోప్రా తాజా సంచలనం

నా భర్త గ్యాస్ సిలిండర్స్ మోశాడు : ప్రియాంక చోప్రా తాజా సంచలనం

Instagram/priyankachopra

ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను సంవత్సరం ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఓ షోలో పాల్గొన్న ప్రియాంక తన భర్త నిక్ జోనాస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

  • Share this:
    ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను సంవత్సరం ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఓ కామెడీ షోలో పాల్గొన్న ప్రియాంక తన భర్త గురించి.. ఆయన తన పెళ్లిలో గ్యాస్ సిలిండర్స్ మోశాడని తెలిపింది. వివరాల్లోకి వెళితే.. ప్రియాంక తాజాగా నటించిన 'ది స్కై ఈజ్‌ పింక్‌’ ఈనెల 11 న విడుదలకు సిద్దమైంది. దీంతో ప్రమోషన్స్‌లో బీజీగా ఉన్నారు. అందులో భాగంగా ప్రియాంక ఓ కామెడీ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా తన వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.



    ఆ షోలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘పెళ్లికి పది రోజుల ముందు నేను ఇండియాకు వచ్చాను. అయితే ఆ సమయంలో ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ షూటింగ్‌లో బిజీగా ఉండేదాన్ని. దీంతో పెళ్లి పనులు చూసుకునేందుకు నిక్‌ ఫ్యామిలీ ఇండియాకు వచ్చింది. అప్పుడు నా భర్త నిక్ పనుల్లో భాగంగా గ్యాస్‌ సిలిండర్స్ కూడా మోశాడని తెలిపింది. ప్రియాంక, నిక్‌ల వివాహం 2018 డిసెంబర్‌ 1న జోథ్‌పూర్‌లోని ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు