దాదాపు ఏడాదిపాటు డేటింగ్ కొనసాగించిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, తన ప్రియుడు అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వయసులో తనకన్నా పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్‌ను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం రాజస్థాన్‌లోని జోధ్ పూర్లో ఉన్న ఉమాయిద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా ప్రియాంక పెళ్లి చేసుకుంది. ప్రస్తుతానికి వీరిద్దరూ అమెరికాలోనే వుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక తనకంటే వయసులో పదేళ్ల చిన్నవాడైన నిక్‌ను పెళ్లి చేసుకుందంటూ విమర్శలు బయలు దేరాయి. దీనికి కౌంటర్‌గా.. ప్రియాంక చోప్రా ఓ అమెరికన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘చాలా మంది మా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికి మాపెళ్లి గురించి చెత్తగా వాగుతూనే ఉన్నారు. నేను నా కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్నానని అందరూ నానా మాటలు అంటున్నారు. అయితే ఒకవేళ నాకంటే వయసులో పెద్దవాడు అయివుంటే మాత్రం ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు. నేను అలా పెళ్లి చేసుకుని ఉంటే కామెంట్లు పెట్టేవారకిి నాపెళ్లి నచ్చుండేదేమో..’ అంటూ ఘాటుగా తనపై వచ్చిన విమర్శలకి సమాధానం ఇచ్చారు.
అది అలా ఉంటే నాలుగు నెలలు కూడా కాకముందే ప్రియాంక, నిక్ పెళ్లి పెటాకులయ్యేలా ఉందని ఇంగ్లీష్ మీడియా కోడై కూస్తోంది. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వైవాహిక జీవితంపై.. ఓ అమెరికన్ మ్యాగజైన్ రీసెంట్గా ఓ కథనాన్ని ప్రచురిస్తూ.. ప్రియాంక, నిక్ దాంపత్య జీవితం ఎమంత సాఫీగా సాగడం లేదని రాసుకొచ్చింది. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని చెబుతోంది. అంతేకాదు వీరిద్దరు త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ పెద్ద పెద్ద రాతలు రాసేసింది. నిక్ ఫ్యామిలీ కూడా వీలైనంత త్వరగా ప్రియాంకతో తెగతెంపులు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు కాని...సోషల్ మీడియాలో మాత్రం తెగ చెక్కర్లు కొడుతోంది. అయితే ఈ కథనాలపై ప్రియాంక, నిక్ ఎలా స్పందిస్తారో చూడాలి.