Priyanka Chopra Jonas : భారతీయ అందం ప్రియాంక చోప్రా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులరో తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను సంవత్సరం పాటు ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం అమెరికాలో కాపురం పెట్టింది. నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మడు పాపులారిటీ మరింత పెరిగింది. దీనికి తోడు ప్రియాంక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఆమె భర్త నిక్ కూడా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో తన ప్రాజెక్ట్స్ గురించి ప్రస్థావిస్తూ.. పోస్ట్‌లు చేస్తుంటాడు. ఈ ఇద్దరూ ఏ చిన్న పోస్ట్ చేసినా లేదా ఫోటో పెట్టినా.. క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. ప్రియాంక ఎక్కడ పార్టీలకు వెళ్లినా, బీచ్‌లకు వెళ్లినా, విహార యాత్రలకు వెళ్లినా.. అక్కడ దిగిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటోంది. సెలబ్రిటీలు ఏం చేసినా విశేషమే. ఎందుకంటే వారికున్న ఫాలోయింగ్ అలాంటిది మరి. అదే తారలకు ప్లస్ పాయింట్. వీరికి కోట్లలో ఫాలోయింగ్ ఉండటం వల్ల కొన్ని సంస్థలు వీరికి డబ్బులిచ్చి మరీ సోషల్‌మీడియా ఖాతాలో ప్రచారం చేస్తుంటాయి. అయితే ఒక్కోక్కరు ఒక్కో విధంగా ఛార్జ్ చేస్తుంటారు. ప్రియాంక కూడా తన పాపులారిటీ తగ్గ స్థాయిలో చార్జ్ చేస్తుందట. ప్రియాంకను ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు. దీంతో ఓ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం కోసం ఆమె రూ.2 కోట్లు తీసుకుంటారని హోపర్ హెచ్‌క్యూ సంస్థ తెలిపింది. ఇక ప్రియాంక నటించిన తాజా హిందీ సినిమా ‘ది స్కై ఈజ్ పింక్’ ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రియాంక ప్రస్తుతం ‘వి కెన్ బి హీరోస్’, ‘ది మాట్రిక్స్ 4’, ‘ది వైట్ టైగర్’ వంటి సినిమాల్లో నటిస్తోంది. ‘ది వైట్ టైగర్’ను నెట్‌ప్లెక్స్ సంస్ధ నిర్మిస్తోంది.