priyanka chopra | ప్రియాంక చోప్రా ఖాకీ నిక్కరు చూస్తే షాకవ్వాల్సిందే...?

మాజీ మిస్ వరల్డ్ కూడా కావడంతో అటు బాలివుడ్‌లో పాటు ఫ్యాషన్ రంగంపై కూడా ప్రియాంకకు మంచి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక వేసుకున్న ఖాకీ నిక్కరు విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతోంది.

news18-telugu
Updated: June 19, 2019, 3:26 PM IST
priyanka chopra | ప్రియాంక చోప్రా ఖాకీ నిక్కరు చూస్తే షాకవ్వాల్సిందే...?
ఖాకీ నిక్కరులో తళుక్కుమన్న ప్రియాంక చోప్రా (Image : Twitter)
  • Share this:
బాలివుడ్ భామ ప్రియాంక చోప్రా ఆర్ఎస్ఎస్ సంస్థలో చేరిందా అంటూ...ట్విట్టర్ లో ట్రోలింగ్ మొదలైంది. ఇటీవల ప్రియాంక చోప్రా న్యూయార్క్ లోని అపార్ట్ నుంచి తన భర్త నిక్ జోనస్ తో కలిసి బయటకు వస్తుండగా, ఫోటోలు క్లిక్ మనిపించాయి. అయితే ఆ ఫోటోలో ప్రియాంక ఖాకీ నిక్కరు వేసుకొని నల్ల బెల్ట్ పెట్టుకొని ఉంది. దీంతో నెటిజన్లు అచ్చం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ధరించే ఖాకీ నిక్కరు తరహోలే ఉంది అంటూ ట్రోలింగ్ మొదలైంది. నిజానికి ప్రియాంక చోప్రా మొదటి నుంచి స్టైల్ దివాగా పేరు తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉంటే రకరకాల డిజైన్స్ ను ధరించడం ప్రియాంక స్పెషాలిటీ. దాంతో పాటు మాజీ మిస్ వరల్డ్ కూడా కావడంతో అటు బాలివుడ్‌లో పాటు ఫ్యాషన్ రంగంపై కూడా ప్రియాంకకు మంచి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక వేసుకున్న ఖాకీ నిక్కరు విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. కొంత మంది ప్రియాంక చోప్రా ఆర్ఎస్ఎస్ కొత్త ఇంటర్నేషనల్ అంబాసిడర్ అని, ప్రియాంక చోప్రా ఆర్ఎస్ఎస్ మీటింగ్ పూర్తి చేసుకొని వస్తోందంటూ...ట్రోల్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా ఇప్పటికే బేవాచ్ సినిమా ద్వారా హాలివుడ్లో ఫేమస్ అయ్యింది. ఇంటర్నేషనల్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లాడినప్పటి నుంచి ప్రియాంక మరింత ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించింది. కాగా 2017లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు సైతం ప్రియాంక చోప్రా పొట్టి బట్టలు ధరించింది. అప్పుడు సైతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యింది. ఇలా తరచూ పీసీ ట్రోలింగ్ అవ్వడం ఆమె అభిమానుల్లో కలవరం రేపుతోంది.










Published by: Krishna Adithya
First published: June 19, 2019, 3:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading