ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వివాహానికి ముహూర్తం ఖరారైందా..!

ఇప్పటికే ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌ల ఎంగేజ్‌మెంట్ ఆగష్టు 18న భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగానే జరిగింది. తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట.

news18-telugu
Updated: October 17, 2018, 3:33 PM IST
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వివాహానికి ముహూర్తం ఖరారైందా..!
జోథ్‌పూర్‌లో నిక్‌జోనాస్‌తో ప్రియాంక చోెప్రా
  • Share this:
బాలీవుడ్‌లో గత కొన్నిరోజులుగా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ గురించి వార్తలే షికారు చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రియాంక, నిక్ జోనస్ తోడు లేనిదో ఎక్కడా కనిపించడం లేదు. వీళ్లిద్దరు కలిసి పబ్బులు, పార్టీలే కాదు..ప్రముఖ దేవాలయాలను కూడా కలిసే సందర్శిస్తూ అభిమానులకు కనివిందు చేస్తున్నారు.

ఇప్పటికే ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌ల ఎంగేజ్‌మెంట్ ఆగష్టు 18న భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగానే జరిగింది. తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట. ప్రియాంక, నిక్‌లు జోథ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం ఒకింటి వారు కాబోతున్నారు.

అంతేకాదు వీరిద్దరి పెళ్లి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు మూడు రోజులు పాటు అంగరంగ వైభవంగా జరిగే అవకాశాలున్నాయని ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది.

ఎంగేజ్మెంట్ తర్వాత ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌లు తమ వెడ్డింగ్‌కు అనువైన ప్రదేశాలను వెతుకే పనిలో పడ్డారు. కొన్నిరోజులు క్రితం వీళ్లిద్దరు కలిసి జోథ్‌పూర్‌లో ఉన్న మెహ్రాన్‌ఘడ్ కోటను కలిసి సందర్శించి దాన్నే వివాహ వేదికగా ఫిక్స్ చేశారు. 

 

 
First published: October 17, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading